తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Pension Politics: గందరగోళంగా మారిన పెన్షన్ల పంపిణీ.. నల్లజెండాలతో సచివాలయాలకు వృద్ధులు.. హైకోర్టులో పిటిషన్ డిస్మిస్

AP Pension Politics: గందరగోళంగా మారిన పెన్షన్ల పంపిణీ.. నల్లజెండాలతో సచివాలయాలకు వృద్ధులు.. హైకోర్టులో పిటిషన్ డిస్మిస్

Sarath chandra.B HT Telugu

03 April 2024, 12:48 IST

google News
    • AP Pension Politics: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ గందరగోళంగా మారింది.  నగదు బదిలీ పథకాల అమలులో వాలంటీర్ల సేవల్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో మొదలైన రగడ కొనసాగుతోంది. 
సింగరాయకొండలో మంచంపై వృద్ధురాలిని సచివాలయానికి తీసుకొస్తున్న గ్రామస్తులు
సింగరాయకొండలో మంచంపై వృద్ధురాలిని సచివాలయానికి తీసుకొస్తున్న గ్రామస్తులు

సింగరాయకొండలో మంచంపై వృద్ధురాలిని సచివాలయానికి తీసుకొస్తున్న గ్రామస్తులు

AP Pension Politics: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల pensions పంపిణీపై Distribution రగడ కొనసాగుతోంది. వాలంటీర్ల Volunteersతో పెన్షన్ల పంపిణీ వద్దంటూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ హైకోర్టు High Courtలో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. పెన్షన్ల పంపిణీపై పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం హైకోర్టులో వివరణ ఇవ్వడంతో పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

మరోవైపు వరుస సెలవుల తర్వాత నేటి నుంచి బ్యాంకుల్లో లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు మంగళవారం ప్రకటించినా సచివాలయాలకు నగదు చేరలేదు. మంగళవారం బ్యాంకులకు పని దినమైనా ప్రభుత్వం నుంచి ఖాతాలకు నగదు జమ కాకపోవడంతో అవి గ్రామ, వార్డు సచివాలయాలకు చేరలేదు. బుధవారం నుంచి పంపిణీ చేపట్టాలని గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే బ్యాంకుల నుంచి నగదు విత్‌ డ్రా చేసి వాటిని పంపిణీ మాత్రం బుధవారం ప్రారంభం కాలేదు.

బుధవారం ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చి వాటిని లబ్దిదారులకు అందించే కార్యక్రమం సకాలంలో ప్రారంభం కాలేదు. ఉదయాన్నే పెన్షన్ల కోసం సచివాలయాల తలుపులు తెరవక ముందే లబ్దిదారులు చేరుకున్నారు. బ్యాంకుల నగదు రావాల్సి ఉందని చెప్పడంతో అక్కడే ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంటింటి పంపిణీ నిలిచిపోవడానికి టీడీపీ నేతల ఫిర్యాదులే కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగుల్ని మంచాలపై సచివాలయాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల నల్లజెండాలతో ర్యాలీగా సచివాలయాలకు వెళ్లారు.

పనులు మానుకుని సచివాలయాల చుట్టూ తిరగాల్సి రావడంపై వృద్ధుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. టీడీపీ ఫిర్యాదులే దీనికి కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించాలని చెప్పినా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రదర్శనలు, నిరసనలు చేపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చిన వారు ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి జమ చేశారు. రాష్ట్రంలోని 15వేలకు పైగా సచివాలయాల ఖాతాలకు ఈ నగదును జమ చేశారు. సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు నగదును విత్‌ డ్రా చేసి అయా సచివాలయ పరిధిలో పంపిణీ చేయాల్సి ఉంటుంది.

ఎన్నికల సంఘం ఆదేశాలతో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందితో పంపిణీ చేపడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘ కాలిక రోగులకు ఇంటివద్దే పంపిణీ చేయాలని, మిగిలిన కేటగిరీ పెన్షన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేపట్టాలని ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉండటంతో వాటి పరిధిలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో నగదు పంపిణీకి అవసరమైన వారిని ఆ విధులకు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పెన్షన్లను లబ్దిదారుల ఆధార్‌ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్‌ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలని, ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ లేదా వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ ఆధర్యంలో రియల్‌ టైం బెనిఫిసియర్స్ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌బీఐఎస్‌) విధానంలో పింఛన్లను అందించాలని పేర్కొన్నారు.

తాజా పరిస్థితుల్లో సచివాలయాల్లో గందరగోళం నెలకొనడంతో తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాతే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో పెన్షన్ల పంపిణీ వ్యవహారం రాజకీయ అంశంగా మారిపోయింది. వైసీపీ-టీడీపీలు ఎవరికి వారు రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం