AP Pensions Issue: సచివాలయ సిబ్బందితోనే రేపట్నుంచి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ, మార్గదర్శకాలు విడుదలపై సిఎస్ స్పష్టత
02 April 2024, 7:33 IST
- AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల ఆందోళనకు కారణమైన పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ స్పష్టత ఇచ్చారు. సచివాలయ సిబ్బందితోనే ఇంటింటి పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని కలెక్టర్లకు స్పష్టత ఇచ్చారు.
రేపటి నుంచి ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ
AP Pensions Issue: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను మినహాయించడం ఏపీలో రాజకీయ రగడకు కారణమైంది. ఈ వ్యవహారంపై అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈసీ వాలంటీర్లతో పంపిణీ వద్దని సూచిస్తే, అధికారులు ఇంటింటి పంపిణీ నిలిపివేయడంపై విపక్షాలు Opposition Partys అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాజకీయ కుట్రలో భాగంగానే సెర్ప్ అధికారులు ఈ రకమైన ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించాయి. సోమవారం టీడీపీ నేతలు చీఫ్ సెక్రటరీ CSని కలిసి తమ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్, సిపిఎం, జనసేన, సిపిఐలు కూడా పెన్షన్ల పంపిణీ నిలిపి వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో భాగంగా అందిస్తున్న వివిధ రకాల ఫించన్ల పంపిణీకి సంబంధించి సోమవారం రాత్రికి సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Chief secretary కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
పార్టీల ఆందోళన నేపథ్యంలో సోమవారం సచివాలయం నుండి ఫించన్లు పంపిణీ, వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితలు అంశాలపై ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ఫించన్ల pensions పంపిణీపై సిఎస్ స్పష్టత ఇచ్చారు.April 3 ఏప్రిల్ 3వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీకి సంబంధించి సోమవారం రాత్రికి సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రకటించారు. దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఫించన్ల పంపిణీ Distributionచేయడంపై వివిధ జిల్లాల కలక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారుల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు.ఫించన్ల పంపిణీపై వెంటనే సవరించిన మార్గదర్శక ఆదేశాలను జారీ చేస్తున్నట్లు అధికారులకు స్పష్టం చేశారు.
వేసవి ఉష్ణోగ్రతలపై అప్రమత్తం…
ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను,జిల్లా కలక్టర్లను సిఎసి జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఉపాధి హామీ పనులను ఉ.10.30 గం.లోపు పూర్తి చేసేలా,కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, తగిన నీడ ఉండే విధంగా చూడడం తోపాటు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలలకు ఒంటిపూట బడులు జరుగుతున్నందున విద్యాశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో ముఖ్యంగా Do’s Dont’s పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు.
ఏప్రిల్ నాలుగు నుంచి తాగునీటి విడుదల..
వేసవి దృష్ట్యా మంచినీటి చెరువులు పూర్తిగా నీటితో నింపేందుకుగాను ఈనెల 4వతేదీన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు,బందరు,రైవస్ కాలువలకు,ఈనెల 8న నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి సంబంధిత జిల్లాల కలక్టర్లకు చెప్పారు. తాగునీటి చెరువులు నింపేందుకు విడుదల చేసే నీటిని చేపల,రొయ్యల చెరువులకు మళ్ళించకుండా చూడడం తోపాటు శివారు ప్రాంతాల (Tailend Area)కు సక్రమంగా నీరు అందేలా చూడాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.
రాష్ట్ర జల వనరులు,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 20 జిల్లాల్లో సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేసేందుకు కలక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిసరఫరా,బోర్ వెల్స్ అద్దెకు తీసుకోవడం,బోరు బావులను ఫ్లషింగ్ మరియు లోతు చేయడం వంటివి చేపట్టినట్టు వివరించారు.