తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Actor Nikhil Join In Tdp : టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్

Actor Nikhil Join in TDP : టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్

29 March 2024, 22:04 IST

    • Actor Nikhil Siddhartha Join in TDP : హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. 
టీడీపీలో చేరిన హీరో నిఖిల్
టీడీపీలో చేరిన హీరో నిఖిల్

టీడీపీలో చేరిన హీరో నిఖిల్

Actor Nikhil Siddhartha Join in TDP : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ… తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్… ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.

టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల

TDP MLA Candidates List 2024 :  మరోవైపు 4 లోక్‍సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ను(TDP MLA Candidates) ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మినారాయణ, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అవకాశం దక్కింది. ఫలితంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

TDP MP Candidates 2024 : ఎంపీ అభ్యర్థులు:

  • విజయనగరం - అప్పలనాయుడు,
  • ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి
  • అనంతపురం - అంబికా లక్ష్మినారాయణ
  • కడప - చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి.

తాజాగా విడుదలైన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటాకు చోటు దక్కింది. భీమిలి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం దక్కింది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయరామ్ కు గుంతకల్లు సీటు ఖరారైంది.

TDP MLA Candidates List - ఎమ్మెల్యే అభ్యర్థులు:

  • చీపురుపల్లి - కళా వెంకట్రావు
  • బీమిలి - గంటా శ్రీనివాసరావు
  • పాడేరు - వెంకట రమేష్ నాయుడు
  • దర్శి - గొట్టిపాటి లక్ష్మి
  • రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం
  • ఆలూరు - వీరభద్ర గౌడ్
  • గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్
  • అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్
  • కదిరి - కందికుంట వెంకటప్రసాద్

తదుపరి వ్యాసం