తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Smriti Mandhana: ఏం వినిపించలేదు.. కానీ: విరాట్ కోహ్లీతో వీడియో కాల్ విషయాలు చెప్పిన స్మృతి మంధాన

Smriti Mandhana: ఏం వినిపించలేదు.. కానీ: విరాట్ కోహ్లీతో వీడియో కాల్ విషయాలు చెప్పిన స్మృతి మంధాన

18 March 2024, 17:25 IST

    • Smriti Mandhana on Virat Kohli Video Call: డబ్ల్యూపీఎల్ టైటిల్‍ను ఆర్సీబీ మహిళల జట్టు కైవసం చేసుకున్నాక.. కెప్టెన్ స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ కాల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో కాల్ విషయాలను స్మృతి మంధాన వెల్లడించారు.
Smriti Mandhana: ఏం వినిపించలేదు.. కానీ: విరాట్ కోహ్లీతో వీడియో కాల్ విషయాలు చెప్పిన స్మృతి మంధాన
Smriti Mandhana: ఏం వినిపించలేదు.. కానీ: విరాట్ కోహ్లీతో వీడియో కాల్ విషయాలు చెప్పిన స్మృతి మంధాన

Smriti Mandhana: ఏం వినిపించలేదు.. కానీ: విరాట్ కోహ్లీతో వీడియో కాల్ విషయాలు చెప్పిన స్మృతి మంధాన

Smriti Mandhana: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీకి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి టైటిల్ దక్కింది. ఐపీఎల్‍లో ఆర్సీబీ పురుషుల జట్టుకు 16 సీజన్లుగా టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. అయితే, భారత స్టార్ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‍లోనే టైటిల్ సాధించి అదరగొట్టింది. ఆదివారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించిన బెంగళూరు విజేతగా నిలిచింది. ఆర్బీసీ పురుషుల జట్టు తరఫున 16ఏళ్లుగా ఆడుతున్న భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఈ సందర్భంగా మహిళల టీమ్‍కు వీడియో కాల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

Deepak Chahar: ఇది రియ‌ల్ లైఫ్ సైంధ‌వ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెట‌ర్‌ దీప‌క్ చాహ‌ర్‌

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ మహిళల టీమ్ గ్రాండ్‍గా సంబరాలు చేసుకుంది. గ్రౌండ్‍లోనే కేరింతలతో ప్లేయర్లు సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. స్మృతి మంధాన సహా ప్లేయర్లను అభినందించేందుకు విరాట్ కోహ్లీ వీడియో కాల్ చేశారు. మైదానంలోనే వారితో వీడియో కాల్ మాట్లాడి సంతోషాన్ని పంచుకున్నారు. విరాట్ కోహ్లీ వీడియో కాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీ చేసిన పని నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

వినిపించలేదు

వీడియో కాల్‍లో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడారని స్మృతి మంధానకు ప్రెస్‍మీట్‍లో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందించారు. ప్రేక్షకుల అరుపుల మధ్య విరాట్ చెప్పింది సరిగా వినిపించలేదని అన్నారు. కానీ అభినందిస్తూ ఆయన థంప్సప్ చూపించారని తెలిపారు. “అక్కడ చాలా సందడిగా ఉండటంతో నాకు ఏమీ వినిపించలేదు. ఆయన థంప్సప్ చూపించారు. నేనూ అలానే చేశా. ఆయనను త్వరలోనే కలుస్తా” అని స్మృతి మంధాన చెప్పారు.

గతేడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ తమ జట్టుతో ముచ్చటించారని, అది చాలా ఉపయోగపడిందని స్మృతి తెలిపారు. “నిండైన నవ్వుతో ఆయన చాలా సంతోషంగా కనిపించారు. గతేడాది ఆయన మాతో కాసేపు మాట్లాడారు. అది నాకు, జట్టుకు చాలా ఉపయోగపడింది. గత 15 సంవత్సరాలుగా ఆయన ఫ్రాంచైజీతో ఉన్నారు. అందుకే ఆయన ముఖంలో చాలా సంతోషం కనిపించింది. అయితే, శబ్దాలు ఎక్కువగా ఉండటంతో వీడియో కాల్‍లో ఆయన మాటలు వినిపించలేదు. బెంగళూరుకు వెళ్లాక నేను ఆయనతో మాట్లాడతా” అని మంధాన చెప్పారు.

బెంగళూరులో మార్చి 19వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అన్ బాక్స్ ఈవెంట్ జరగనుంది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 మొదలుకానుండగా.. దీనికి ముందు ఈ ఈవెంట్ జరగనుంది. విరాట్ కోహ్లీ సహా ఆర్సీబీ ప్లేయర్లు ఈ ఈవెంట్‍కు హాజరుకానున్నారు.

మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 సీజన్ మొలుకానుంది. తొలి మ్యాచ్‍లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్

డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 113 పరుగులకే ఆలౌటైంది. 19.3 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ చాంపియన్‍గా నిలిచింది. వరుసగా రెండో సీజన్‍లో రన్నరప్‍తో సరిపెట్టుకుంది ఢిల్లీ.

తదుపరి వ్యాసం