తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి

Virat Kohli: నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu

20 March 2024, 8:58 IST

    • Virat Kohli: తనను కింగ్ అని పిలవొద్దు అంటూ అందరినీ వేడుకున్నాడు విరాట్ కోహ్లి. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ టీమ్ తో చేరిన కోహ్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి
నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి (PTI)

నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఆర్సీబీ టీమ్ ఈవెంట్లో పాల్గొన్న అతడు.. తనను కింగ్ అని పిలవొద్దని అనడం విశేషం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం (మార్చి 19) ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో పాల్గొన్న కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

కింగ్ అని పిలవొద్దు.. విరాట్ అనండి

ఈ మధ్యే డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ మహిళల టీమ్ తో కలిసి ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెస్సి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ అన్‌బాక్స్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వహిస్తున్న యాంకర్ మాట్లాడుతూ.. "విరాట్ నిన్నో ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. నువ్వు చాలా రోజుల నుంచి మాట్లాడలేదు. కనిపించలేదు. మొదటి ప్రశ్న.. కింగ్ ఎలా ఫీలవుతున్నాడు?" అని అడిగాడు.

దీనికి విరాట్ స్పందించబోతుండగా.. స్టేడియంలోని ఫ్యాన్స్ అందరూ పెద్దగా అరిచారు. అతన్ని మాట్లాడనివ్వాలని పదేపదే యాంకర్ కోరాడు. తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ముందుగా తనను ఆ కింగ్ అనే పదంతో పిలవొద్దని, కేవలం విరాట్ అని పిలవండని కోరాడు.

"తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. నన్ను మాట్లాడనివ్వండి. రాత్రికి చెన్నై వెళ్లాలి. చార్టెర్డ్ ఫ్లైట్ ఉంది. ఎక్కువ టైమ్ లేదు. ముందుగా నన్ను ఆ పదం (కింగ్)తో పిలవొద్దు. నేను ఫాఫ్ తోనూ ఇదే విషయం చెప్పాను. ఎవరైనా అలా పిలిచినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కేవలం విరాట్ అని పిలవండి చాలు" అని కోహ్లి అన్నాడు.

కోహ్లికి కింగ్ అనే పేరు ఎలా వచ్చిదంటే?

ఆస్ట్రేలియాలో నివసించే ఇండియన్ క్రికెట్ అభిమాని కునాల్ గాంధీ తానే మొట్టమొదటిసారిగా విరాట్ కోహ్లిని కింగ్ అని పిలిచినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వచ్చినప్పుడు కోహ్లికి జెర్సీని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నానని, అప్పుడే కింగ్ కోహ్లి అని రాసి దానిని ఇచ్చినట్లు అతడు తెలిపాడు.

క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను గాడ్ అని పిలిచేవారు. అతని తర్వాత అదే స్థాయిలో ఆడుతున్న విరాట్ కోహ్లిని కింగ్ అని అంటున్నారు. ఇక యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ని ప్రిన్స్ అని పిలుస్తున్నారు. అయితే తనను మాత్రం కింగ్ అని అనొద్దని విరాటే కోరడంతో ఇక నుంచి అభిమానులుగానీ, మరెవరైనాగానీ ఆ పదం వాడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

మేమూ ట్రోఫీ గెలుస్తాం: కోహ్లి

ఇక ఆర్సీబీ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచినట్లే తాము కూడా ఐపీఎల్ గెలుస్తామని విరాట్ కోహ్లి అన్నాడు. "చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్లు గెలిచినప్పుడు మేము చూశాం. ఇప్పుడు మేము కూడా ట్రోఫీ గెలిచి ఆ ఆనందాన్ని రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం. అది నిజంగా చాలా ప్రత్యేకం అవుతుంది. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం నాకో కల. అభిమానులు, ఫ్రాంఛైజీ కోసం ట్రోఫీ గెలవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను" అని కోహ్లి అన్నాడు.

ఐపీఎల్లో ఈ మధ్యే ఆర్సీబీతో కోహ్లి 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకూ ఒకే ఒక్క ఫ్రాంఛైజీకి ఆడిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

తదుపరి వ్యాసం