తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rinku Singh: రింకు సింగ్ గొప్ప ఫినిషర్‌గా ఇలా ఎదిగాడు.. ఆ ఫొటో వెనుక స్టోరీ ఇదీ: దినేష్ కార్తీక్

Rinku Singh: రింకు సింగ్ గొప్ప ఫినిషర్‌గా ఇలా ఎదిగాడు.. ఆ ఫొటో వెనుక స్టోరీ ఇదీ: దినేష్ కార్తీక్

Hari Prasad S HT Telugu

24 November 2023, 11:17 IST

    • Rinku Singh: రింకు సింగ్ గొప్ప ఫినిషర్‌గా ఎలా ఎదిగాడు? ఆస్ట్రేలియాతో తొలి టీ20లో టీమిండియాను గెలిపించిన తర్వాత బౌండరీ దగ్గర అతడు అభిషేర్ నాయర్ ను ఎందుకు హత్తుకున్నాడు? దీని వెనుక అసలు స్టోరీని దినేష్ కార్తీక్ వివరించాడు.
అభిషేక్ నాయర్ తో రింకు సింగ్
అభిషేక్ నాయర్ తో రింకు సింగ్

అభిషేక్ నాయర్ తో రింకు సింగ్

Rinku Singh: టీమిండియాకు రింకు సింగ్ రూపంలో మరో గొప్ప ఫినిషర్ దొరికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అతడు మ్యాచ్ ను ముగించిన తీరు చూసి చాలా మందికి ధోనీ గుర్తుకు వచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ పలు మ్యాచ్ లలో ఇలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ కు అనూహ్య విజయాలు సాధించి పెట్టిన రింకు.. ఇప్పుడు టీమిండియాకూ అదే రిపీట్ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

అయితే రింకు సింగ్ ఇలా ఎలా ఎదిగాడు? మ్యాచ్ తర్వాత అతడు మరో క్రికెట్ అభిషేక్ నాయర్ ను ఎందుకు హత్తుకున్నాడు? దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వివరించాడు. మ్యాచ్ తర్వాత తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా అతడో పెద్ద పోస్ట్ చేశాడు. యూపీలోని అలీగఢ్ నుంచి వచ్చిన రింకు ఈ స్థాయికి ఎలా వచ్చాడో మీరే చూడండి.

రింకు వెనుక అభిషేక్ నాయర్

రింకు సింగ్ ఇప్పుడీ స్థాయిలో ఆడుతుండటం వెనుక ప్రధాన కారణం మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఐదేళ్ల కిందట తాను కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఉన్న సమయంలో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. రింకూకి కొన్ని కఠినమైన పనులు ఇచ్చి అతన్ని మరింత రాలుదేల్చింది అభిషేకే అని కార్తీక్ చెప్పాడు.

"ఇది మనసుకు హత్తుకుంటున్న ఫొటో. అభిషేక్ నాయర్, రింకు సింగ్ మధ్య ఉన్న బంధం. అది 2018లో నేను కేకేఆర్ జట్టులో ఉన్నప్పుడు మొదలైంది. రింకు సామర్థ్యమేంటో అభిషేక్ కు అప్పటి నుంచే తెలుసు. రానున్న రోజుల్లో అతడు చెలరేగుతాడని నాతో అనేవాడు.

అలీగఢ్ లాంటి చిన్న ఊరి నుంచి వచ్చిన రింకు పెద్దగా ఆలోచిస్తే చాలని అనుకునేవాడు. రింకుతో కలిసి పని చేసి అతని ఆలోచన అలా మార్చింది నాయరే. అంతేకాదు డెత్ ఓవర్లలో బాగా ఆడే సామర్థ్యాన్ని కూడా మెరుగ్గా చేశాడు. రింకు గాయపడినప్పుడు కూడా అతడు టీమ్ తో ఉండేలా యాజమాన్యాన్ని ఒప్పించాడు అభిషేక్ నాయర్. ఐపీఎల్ తర్వాత నాయర్ ఇంట్లోనే ఉండి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

డొమెస్టిక్ క్రికెట్ లో ఇరగదీశాడు. చివరికి కేకేఆర్ కు అతడు ఎలా ఆడాలని నాయర్ భావించాడో ఈ ఏడాది రింకు అలాగే ఆడాడు. మ్యాచ్ విన్నింగ్ ఫినిషర్ గా మారాడు. ఈ ఫొటో చూసిన తర్వాత నాయర్ ఓ కోచ్ గా ఎలా ఎదిగాడో నాకు అర్థమైంది. అంతర్జాతీయ స్థాయిలో మనం కోచింగ్ ఇచ్చిన ప్లేయర్ ఇలా రాణించడం ఎవరికైనా అత్యద్భుతమైన ఫీలింగ్. వెల్ డన్ అభిషేర్ నాయర్, రింకు సింగ్" అని కార్తీక్ పోస్ట్ చేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్ లు బాది కోల్‌కతాను గెలిపించినప్పటి నుంచీ ఇండియన్ క్రికెట్ లో రింకు పేరు మార్మోగిపోతోంది. ఆ తర్వాత వెంటనే అతడు ఇండియన్ టీమ్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో రెగ్యులర్ మెంబర్ గా మారి.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా రింకు ముందుకు సాగుతున్నాడు.

తదుపరి వ్యాసం