Dipika Pallikal: భార్యకు గోల్డ్ మెడల్.. దినేష్ కార్తీక్ ఫుల్ ఖుష్-dipika pallikal gets gold in asian games dinesh karthik is on cloud nine ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Dipika Pallikal Gets Gold In Asian Games Dinesh Karthik Is On Cloud Nine

Dipika Pallikal: భార్యకు గోల్డ్ మెడల్.. దినేష్ కార్తీక్ ఫుల్ ఖుష్

Hari Prasad S HT Telugu
Oct 05, 2023 05:04 PM IST

Dipika Pallikal: భార్యకు గోల్డ్ మెడల్ రావడంతో క్రికెటర్ దినేష్ కార్తీక్ ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఏషియన్ గేమ్స్ స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ లో దీపికా పల్లికల్, హరిందర్ పాల్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.

ఏషియన్ గేమ్స్ స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన దీపికా పల్లికల్
ఏషియన్ గేమ్స్ స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన దీపికా పల్లికల్ (AP)

Dipika Pallikal: టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అతని భార్య, స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఏషియన్ గేమ్స్ 2023లో గోల్డ్ మెడల్ గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లో హరిందర్ పాల్ సింగ్ తో కలిసి బరిలోకి దిగిన దీపికా.. గురువారం (అక్టోబర్ 5) ఉదయం జరిగిన ఫైనల్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఓవైపు క్రికెట్ వరల్డ్ కప్ 2023 కామెంటరీలో బిజీగా ఉన్న దినేష్ కార్తీక్ కు తన భార్య దీపికా పల్లికల్ ఫైనల్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించారు హాంగ్జౌలో ఉన్న ఇండియా క్రికెటర్లు. ఏషియన్ గేమ్స్ లో పాల్గొనడానికి సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ త్రిపాటీ, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్లు దీపిక మ్యాచ్ గురించి లైవ్ అప్డేట్స్ దినేష్ కార్తీక్ కు అందించారు.

ఈ స్క్వాష్ ఫైనల్ మ్యాచ్ ను ఇండియన్ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. ఈ మ్యాచ్ లో దీపిక, హరిందర్ జోడీ అల్ఫా అజ్మన్, మహ్మద్ సయాఫిక్ జోడీపై 11-10, 11-0 తేడాతో విజయం సాధించింది. ఏషియన్ గేమ్స్ లో దీపికకు ఇదే తొలి గోల్డ్ మెడల్. ఇంతకుముందు ఆమె ఒక సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ గెలిచింది.

ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ అందించినందుకు, విన్నింగ్ మూమెంట్ కు సంబంధించిన వీడియో పంపినందుకు టీమ్ మేట్స్ కు థ్యాంక్స్ చెబుతూ కార్తీక్ ఓ ట్వీట్ చేశాడు. "థ్యాంక్స్ సుందర్, రాహుల్ త్రిపాఠీ, హర్ష. దీపికా, ఇండియా స్క్వాష్ టీమ్ కు ప్రత్యక్షంగా వెళ్లి మద్దతు తెలిపారు. ఇది గొప్ప విషయం. అక్కడ లేకపోవడం బాధగా ఉంది. కానీ మీరు క్రికెట్ లో బిజీగా ఉంటూనే అక్కడికి వెళ్లి లైవ్ చూసినందుకు సంతోషంగా ఉంది" అని కార్తీక్ అన్నాడు.

దీపికా పల్లికల్ గోల్డ్ మెడల్ గెలిచిన సందర్భం వీడియో పంపిన వాషింగ్టన్ సుందర్ కు కూడా ప్రత్యేకంగా కార్తీక్ థ్యాంక్స్ చెప్పాడు. ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా పతకాల పంట పండిస్తోంది. తొలిసారి 100 పతకాల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. ఇండియాకు స్క్వాష్ లో ఇది నాలుగో మెడల్. మెన్స్ టీమ్ ఇప్పటికే ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి గోల్డ్ గెలిచింది.

WhatsApp channel