తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill: ఈ వరల్డ్ కప్ అతనిదే.. కనీసం రెండు సెంచరీలు చేస్తాడు: ఆకాశ్ చోప్రా

Shubman Gill: ఈ వరల్డ్ కప్ అతనిదే.. కనీసం రెండు సెంచరీలు చేస్తాడు: ఆకాశ్ చోప్రా

Hari Prasad S HT Telugu

02 October 2023, 15:35 IST

    • Shubman Gill: ఈ వరల్డ్ కప్ అతనిదే.. కనీసం రెండు సెంచరీలు చేస్తాడు అని శుభ్‌మన్ గిల్ ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ ఏడాది గిల్ వన్డేల్లో టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.
శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ (AFP)

శుభ్‌మన్ గిల్

Shubman Gill: వరల్డ్ కప్ 2023 టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దే అని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. అతడు చాలా పరుగులు చేస్తాడని, కనీసం రెండు సెంచరీలైతే పక్కా అని చోప్రా అనడం విశేషం. ఈ ఏడాది వన్డేల్లో టాఫ్ ఫామ్ లో ఉన్న గిల్ ఇప్పటికే 1230 రన్స్ చేశాడు. ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్ పై ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

ప్రస్తుతం వన్డేల్లో ర్యాంకుల్లో శుభ్‌మన్ గిల్ 847 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటే కేవలం 10 పాయింట్లు వెనుక ఉన్నాడు. వరల్డ్ కప్ సందర్భంగా గిల్ నంబర్ వన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ పై ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. గిల్ ఓ భారీ సెంచరీ కూడా చేస్తాడని అంచాన వేశాడు.

"ఈ టోర్నమెంట్ శుభ్‌మన్ గిల్ దే. నిజానికి ఈ టోర్నమెంట్ టాప్ 3 బ్యాటర్లది. మంచి బ్యాటర్లు రికార్డులు తిరగరాస్తారు. శుభ్‌మన్ గిల్ చాలా రన్స్ చేస్తాడు. అతడు కనీసం రెండు సెంచరీలు చేస్తాడని అనుకుంటున్నాను. మూడు చేసిన ఆశ్చర్యమేమీ లేదు. అతడు అలసిపోకపోతే అందులో ఒకటి డాడీ సెంచరీ (150+ రన్స్) కూడా ఉంటుంది. గిల్ క్వాలిటీ ప్లేయర్. ఈ వరల్డ్ కప్ అతనిదే" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

ఇక లెఫ్టామ్ స్పిన్ బౌలింగ్ లో గిల్ ఆడే విధానాన్ని కూడా చోప్రా కొనియాడాడు. "ఒక దశలో లెఫ్టామ్ స్పిన్ లో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. కానీ వాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలనని ఆసియా కప్ లో సెంచరీ ద్వారా నిరూపించాడు. నా అభిప్రాయం మేరకు అతని బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ ఇది" అని చోప్రా అన్నాడు.

గిల్ తన కెరీర్లో ఇప్పటి వరకూ 35 వన్డేలు ఆడి ఏకంగా 66.10 సగటుతో 1917 రన్స్ చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది గిల్ 72 సగటుతో 1230 రన్స్ చేశాడు. వరల్డ్ కప్ కు ముందు గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై కూడా ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.

తదుపరి వ్యాసం