Shubman Gill ODI Rank: బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు శుభ్‌మన్ గిల్ గండం.. మరీ దగ్గరగా వచ్చేశాడు-shubman gill odi rank soon to topple babar azam cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill Odi Rank: బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు శుభ్‌మన్ గిల్ గండం.. మరీ దగ్గరగా వచ్చేశాడు

Shubman Gill ODI Rank: బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు శుభ్‌మన్ గిల్ గండం.. మరీ దగ్గరగా వచ్చేశాడు

Hari Prasad S HT Telugu

Shubman Gill ODI Rank: బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకుకు శుభ్‌మన్ గిల్ గండం పొంచి ఉంది. అతడు బాబర్ ర్యాంకుకు మరింత చేరువగా రావడంతోపాటు కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించాడు.

శుభ్‌మన్ గిల్ (AFP)

Shubman Gill ODI Rank: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టడానికి సిద్ధమయ్యాడు. గిల్ ఒకవేళ ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడి కనీసం 30 పరుగులు చేసి ఉంటే.. నంబర్ వన్ అయ్యేవాడు. కానీ ఈ మ్యాచ్ లో అతడు ఆడటం లేదు.

దీంతో రానున్న వరల్డ్ కప్‌లో బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంక్‌పై శుభ్‌మన్ గిల్ కన్నేశాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 178 రన్స్ చేసిన గిల్ కు మూడో వన్డే నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ తాజాగా బుధవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ చేసిన వన్డే ర్యాంకుల్లో 857 పాయింట్లతో బాబర్ ఆజం నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

గిల్ 847 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. కేవలం 10 రేటింగ్ పాయింట్ల దూరంలోనే అతడు ఉండటం విశేషం. వరల్డ్ కప్ లోకి నంబర్ వన్ బ్యాటర్ గా బాబర్ అడుగుపెడుతున్నా.. ఆ మెగా టోర్నీలో మాత్రం అతని ర్యాంక్ కు గిల్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 74, రెండో వన్డేలో 104 రన్స్ చేశాడు శుభ్‌మన్ గిల్.

అయితే వరల్డ్ కప్ కంటే ముందు కాస్త విశ్రాంతి అవసరం అని భావించడంతో మూడో వన్డేకు ముందు అతన్ని ఇంటికి పంపించేశారు. లేదంటే చివరి వన్డేలో గిల్ తన ఫామ్ కొనసాగించి ఉంటే వచ్చే వారానికే అతడు నంబర్ వన్ అయ్యేవాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానంలో 743 రేటింగ్స్ పాయింట్లతో సౌతాఫ్రికా బ్యాటర్ వాండెర్ డుసెన్, 729 పాయింట్లతో హ్యారీ టెక్టర్ నాలుగు, 728 పాయింట్లతో పాకిస్థాన్ బ్యాటర్ ఇమాముల్ హక్ ఐదో స్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది వన్డేల్లో శుభ్‌మన్ గిల్ టాప్ స్కోరర్ కావడం విశేషం. గిల్ ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్ పై ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్ గా టీమిండియా తరఫున అత్యంత నిలకడగా ఆడుతున్నాడు.