తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Maxwell Hospitalised: మందు ఎక్కువై హాస్పిటల్లో చేరిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్.. అసలేం జరిగింది?

Maxwell hospitalised: మందు ఎక్కువై హాస్పిటల్లో చేరిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్.. అసలేం జరిగింది?

Hari Prasad S HT Telugu

23 January 2024, 8:11 IST

    • Maxwell hospitalised: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చిక్కుల్లో పడ్డాడు. మందు ఎక్కువై అతడు హాస్పిటల్లో చేరాడన్న ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ జరుపుతోంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (PTI)

గ్లెన్ మ్యాక్స్‌వెల్

Maxwell hospitalised: ఆస్ట్రేలియా టీమ్ గతేడాది వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పుడు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఓ పబ్‌లో పీకలదాకా మందు తాగి తర్వాత హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

దీనిపై తీవ్రంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. ఇప్పటికే వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి అతన్ని తప్పించింది. అతనిపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.

బ్రెట్ లీ ఈవెంట్‌కు వెళ్లి..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అడిలైడ్ లోని ఓ పబ్ లో తన బ్యాండ్ సిక్స్ అండ్ ఔట్ తో పర్ఫామ్ చేస్తున్నాడు. అది చూడటానికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అక్కడికి వెళ్లాడు. ఆ పబ్ లోనే అతడు బాగా మందు తాగాడని, ఆ వెంటనే అతన్ని రాయల్ అడిలైడ్ హాస్పిటల్లో చేర్చారని తెలిసింది. దీంతో మందు ఎక్కువయ్యే అతన్ని ఇలా హాస్పిటల్ కు తరలించారన్న వార్తలు వచ్చాయి.

దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించింది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ నుంచి గ్లెన్ మ్యాక్స్‌వెల్ ను తప్పించారు. అయితే దానికి, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని మాత్రం సీఏ అధికారులు చెబుతున్నారు. అతడు విండీస్ తో టీ20 సిరీస్ కు తిరిగి జట్టులోకి వస్తాడని కూడా వాళ్లు స్పష్టం చేశారు.

ఆ పబ్ లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ చాలా తక్కువసేపే ఉన్నాడని, రాత్రంతా కూడా లేడని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో మందు ఎక్కువైందా లేక ఇంకా ఏదైనా జరిగిందా అన్న కోణంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ జరుపుతోంది. గత వీకెండ్ లో ఈ ఘటన జరిగిందని, అతడు ఆసుపత్రి పాలైన విషయం అప్పుడే క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలుసని డైలీ టెలిగ్రాఫ్ వెల్లడించింది.

గతేడాది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విజయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ సందర్భంగా ఓ గోల్ఫ్ కార్ట్ నుంచి కింద పడి కన్‌కషన్ కు గురైన అతడు.. తిరిగి వచ్చి అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆస్ట్రేలియా 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సందర్భంలో వచ్చి డబుల్ సెంచరీతో గెలిపించాడు.

కండరాలు పట్టేయడంతో కిందామీదా పడుతూ కూడా ఆ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తోనే ఆస్ట్రేలియా సెమీస్ చేరి, తర్వాత ఫైనల్, ఆ తర్వాత ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్ సిక్స్ కొట్టింది కూడా మ్యాక్స్‌వెలే కావడం విశేషం. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరోసారి.

ఇక 2022లో భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను పెళ్లి చేసుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్.. గతేడాది సెప్టెంబర్లో తండ్రయ్యాడు. ఈ దంపతులకు ఓ బాబు జన్మించాడు.

తదుపరి వ్యాసం