Maxwell on IPL: ఇక నడవలేను అనుకున్నప్పుడే ఐపీఎల్ ఆడటం మానేస్తా: మ్యాక్స్‌వెల్ కామెంట్స్ వైరల్-maxwell on ipl says he will play untill he can not walk anymore ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Maxwell On Ipl: ఇక నడవలేను అనుకున్నప్పుడే ఐపీఎల్ ఆడటం మానేస్తా: మ్యాక్స్‌వెల్ కామెంట్స్ వైరల్

Maxwell on IPL: ఇక నడవలేను అనుకున్నప్పుడే ఐపీఎల్ ఆడటం మానేస్తా: మ్యాక్స్‌వెల్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Dec 06, 2023 07:30 PM IST

Maxwell on IPL: తానిక ఏమాత్రం నడవలేనని అనుకున్న రోజే ఐపీఎల్ ఆడటం మానేస్తా అని ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అనడం విశేషం. తన కెరీర్లో ఆడే చివరి టోర్నీ అదే అవుతుందని అతడు స్పష్టం చేశాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (PTI)

Maxwell on IPL: ఐపీఎల్లో ఆడటంపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుధవారం (డిసెంబర్ 6) మెల్‌బోర్న్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన మ్యాక్సీ.. అక్కడ మీడియాతో మాట్లాడాడు. తాను ఇక నడవలేను అనుకున్న రోజే ఐపీఎల్ ఆడటం మానేస్తా అని అతడు అనడం విశేషం.

మ్యాక్స్‌వెల్ బిగ్ బాష్ లీగ్ లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడనున్నాడు. ఇండియాతో సిరీస్ లో చివరి రెండు టీ20లు ఆడకుండానే వచ్చేసిన మ్యాక్సీకి వారం రోజుల విశ్రాంతి లభించింది. బిగ్ బాస్ లీగ్ లో ఆడబోయే ముందు ఐపీఎల్లో ఆడటం తనకెంత ఇష్టమో అతడు చెప్పాడు. తన కెరీర్లో ఆడబోయే చివరి టోర్నీ అదే అవుతుందని మ్యాక్సీ అన్నాడు.

"నేను ఆడబోయే చివరి టోర్నీ ఐపీఎల్ అవుతుంది. నేనిక నడవలేను అనుకున్నంత కాలం ఐపీఎల్ ఆడతాను. నా కెరీర్ మొత్తం ఐపీఎల్ ఎంత బాగా సాగిందో. నేను కలిసి మనుషులు, కోచ్‌లు, అంతర్జాతీయ ఆటగాళ్లు.. నా కెరీర్ కు ఆ టోర్నీ ఎంతగానో ఉపయోగపడింది. ఏబీ, విరాట్ లాంటి ప్లేయర్స్ తో రెండు నెలల పాటు గడిపే సమయం లభిస్తుంది.

వాళ్లతో మాట్లాడటం, ఇతర మ్యాచ్ లు చూడటం.. ఓ ప్లేయర్ కు మంచి అనుభవం. ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ కు కూడా ఈ అనుభవం పొందాలి. వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగబోయే వెస్టిండీస్ పరిస్థితులు ఇక్కడ కూడా ఉంటాయి. వాతావరణం కాస్త పొడిగా ఉంటూ పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయి" అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.

ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్నాడు. గత రెండు సీజన్లలో ఆ టీమ్ తరఫున మ్యాక్సీ బాగానే రాణించాడు. 2021లో 513 రన్స్ చేయగా.. ఈ ఏడాది 14 మ్యాచ్ లలో 400 రన్స్ చేశాడు. వచ్చే ఏడాది కూడా ఆర్సీబీ టీమ్ మ్యాక్స్‌వెల్ వైపే చూస్తోంది. అయితే అంతకుముందు జరగబోయే వేలంలో ఇతర ఆస్ట్రేలియా ప్లేయర్స్ కమిన్స్, స్మిత్, హెడ్ లాంటి వాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలం డిసెంబర్ 19న జరగనుంది.

Whats_app_banner