Josh Hazlewood: సింగిల్ రన్ ఇవ్వకుండా మూడు వికెట్లు - వెస్టిండీస్‌పై ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ సంచలనం
Josh Hazlewood: వెస్టిండీస్‌తో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ సంచలనం నమోదు చేశాడు. సింగిల్ రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు.
Josh Hazlewood: వెస్టిండీస్‌తో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు చుక్కలు చూపించాడు. సింగిల్ రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. హేజిల్‌వుడ్ దెబ్బకు జీరో రన్స్‌కే వెస్టిండీస్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే చంద్రపాల్‌ను ఔట్‌చేసి హేజిల్‌వుడ్ షాకిచ్చాడు. ఆ తర్వాత విండీస్ స్కోరు ఒక పరుగు వద్ద రెండో వికెట్ తీశాడు హేజిల్‌వుడ్.
కెప్టెన్ బ్రాత్‌వైట్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే అథాంజేను ఔట్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన హేజిల్‌వుడ్ సింగిల్ రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌలింగ్ ఫిగర్స్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదో ఓవర్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మెకంజీ రన్ తీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే హోడ్జ్‌ను కూడా హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు.
హేజిల్‌వుడ్ దెబ్బకు వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పది ఓవర్లలో 19 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌటైన వెస్టిండీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. హేజిల్‌వుడ్ జోరు చూస్తుంటే రెండు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.
250 వికెట్లు...
సెకండ్ ఇన్నింగ్స్ నాలుగు వికెట్లతో హేజిల్‌వుడ్ టెస్టుల్లో రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 250 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 250 వికెట్ల రికార్డును అందుకున్న తొమ్మిదో పేసర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ 563 వికెట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 67 టెస్ట్‌లు ఆడిన హేజిల్‌వుడ్ 253 వికెట్లు తీశాడు.
హెడ్ వన్డే బ్యాటింగ్...
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 283 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. వన్డే తరహాలోనే హెడ్ బ్యాటింగ్ చేశాడు. 134 బాల్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 119 రన్స్ చేశాడు. 45 పరుగులతో ఖవాజా సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్, లబుషేన్, గ్రీన్, మిచెల్ మార్ష్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. నాథన్ లయాన్‌తో కలిసి ఆస్ట్రేలియా స్కోరును హెడ్ 250 పరుగులు దాటించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ ఐదు వికెట్లు తీసుకోగా...రోచ్, గ్రీవ్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 188 పరుగులకే ఆలౌటైంది. మెకంజీ (50 రన్స్)తో పాటు లాస్ట్ బ్యాట్స్‌మెన్ షమ్మర్ జోసెఫ్ (36 రన్స్) వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. 130 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ను మెకంజీ, జోసెఫ్ కలిసి పరువు కాపాడారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు.అతడితో పాటు కమిన్స్ నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను దెబ్బకొట్టారు.