తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli Michael Jackson Slide: విరాట్ కోహ్లి మైఖేల్ జాక్సన్ స్టెప్ చూశారా.. సెలబ్రేషన్స్ ఇలా ఉండాలి

Kohli Michael Jackson slide: విరాట్ కోహ్లి మైఖేల్ జాక్సన్ స్టెప్ చూశారా.. సెలబ్రేషన్స్ ఇలా ఉండాలి

Hari Prasad S HT Telugu

18 January 2024, 19:54 IST

    • Kohli Michael Jackson slide: ఆఫ్ఘనిస్థాన్ తో కష్టమ్మీద మూడో టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకునే సమయంలో విరాట్ కోహ్లి వేసిన మైఖేల్ జాక్సన్ స్లైడ్ వీడియో వైరల్ అవుతోంది.
ఆఫ్ఘనిస్థాన్ తో మూడో టీ20 తర్వాత విరాట్ కోహ్లి వెరైటీ సెలబ్రేషన్స్
ఆఫ్ఘనిస్థాన్ తో మూడో టీ20 తర్వాత విరాట్ కోహ్లి వెరైటీ సెలబ్రేషన్స్ (AFP-ANI)

ఆఫ్ఘనిస్థాన్ తో మూడో టీ20 తర్వాత విరాట్ కోహ్లి వెరైటీ సెలబ్రేషన్స్

Kohli Michael Jackson slide: క్రికెట్ ఫీల్డ్ లో తన ఆటతోపాటు తన అదుపులో ఉంచుకోలేని భావోద్వేగాలతోనూ విరాట్ కోహ్లి అలరిస్తుంటాడు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ తో మూడో టీ20లో గెలిచిన తర్వాత అతడు అలాగే దివంగత పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ స్టెప్పుతో అలరించాడు. సెలబ్రేషన్స్ అంటే ఇలా తనలాగే చేసుకోవాలన్నట్లుగా కోహ్లి కనిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మూడో టీ20లో రెండు సూపర్ ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచిన విషయం తెలుసు కదా. కష్టపడితే వచ్చే విజయం ఇచ్చే కిక్కే వేరు అన్నట్లుగా విరాట్ కోహ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియన్ టీమ్.. ట్రోఫీ సొంతం చేసుకుంది. ట్రోఫీ గెలిచిన తర్వాత గ్రూప్ ఫొటో సమయంలో కోహ్లి మైఖేల్ జాక్సన్ స్లైడ్ తో సహచరుల దగ్గరికి దూసుకొచ్చాడు.

కోహ్లి స్టైల్ సెలబ్రేషన్స్

విరాట్ కోహ్లి తన భావోద్వేగాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోడు. ఆ సమయంలో తనకు ఏది అనిపిస్తే అది చేసేస్తాడు. ఆవేశమైనా, సంతోషమైనా అక్కడికక్కడే చూపించేస్తాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ మొత్తం చాలా ఆవేశంగా కనిపించిన అతడు.. గెలిచిన తర్వాత మాత్రం ఎంతో ఉల్లాసంగా గంతులేశాడు. ఆ ఉత్సాహంతోనే గ్రూప్ ఫొటోకు సిద్ధమవుతున్న టీమ్ దగ్గరకు మైఖేల్ జాక్సన్ వేసే స్లైడ్ తో దూసుకొచ్చాడు.

ఈ వీడియో ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. అంతకుముందు ట్రోఫీ అందుకోవడానికి వేచి చూస్తున్న సమయంలోనూ సహచరులు చూస్తుండగా కోహ్లి ఓ వెరైటీ డ్యాన్స్ మూవ్ తో అలరించాడు. ఈ మ్యాచ్ లో తొలి బంతికే గోల్డెన్ డకౌటైనా కూడా ఫీల్డింగ్ సమయంలో కోహ్లి చురుకుగా కనిపించాడు. బౌండరీ దగ్గర గాల్లోకి ఎగురుతూ ఓ సిక్స్ ఆపిన తీరు అయితే మ్యాచ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

ఆ ఒక్క మ్యాచ్‌లోనే..

ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడని విరాట్.. రెండో మ్యాచ్ లో 16 బంతుల్లోనే 29 రన్స్ చేశాడు. ఇదొక్క ఇన్నింగ్స్ తో తాను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండటానికి అర్హుడిని అని విరాట్ నిరూపించుకున్నాడు. ఇక రానున్న ఐపీఎల్లోనూ చెలరేగితే అతడే వరల్డ్ కప్ లో టీమ్ బలమవుతాడు. ఐపీఎల్లో తన హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలోనే కోహ్లి వరల్డ్ కప్ కు ముందు తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు.

నిజానికి తనకు బాగా కలిసొచ్చిన స్టేడియంలో చెలరేగుతాడని ఆశతో వచ్చిన ఫ్యాన్స్ ను చివరి మ్యాచ్ లో అతడు నిరాశ పరిచాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయే ఔటయ్యాడు. విరాట్ ఇక ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఆడనున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 1న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

తదుపరి వ్యాసం