తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kapil Dev Kidnap: కపిల్ దేవ్ కిడ్నాప్ వీడియో వెనుక అసలు స్టోరీ ఇదీ.. ప్రమోషన్ అదిరిపోయిందిగా!

Kapil Dev Kidnap: కపిల్ దేవ్ కిడ్నాప్ వీడియో వెనుక అసలు స్టోరీ ఇదీ.. ప్రమోషన్ అదిరిపోయిందిగా!

Hari Prasad S HT Telugu

26 September 2023, 15:34 IST

    • Kapil Dev Kidnap: కపిల్ దేవ్ కిడ్నాప్ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. రాత్రి నుంచి ఫ్యాన్స్ అంతా తెగ కంగారు పడుతుంటే.. దీని వెనుక అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రమోషన్ లో భాగంగా ఈ వీడియో రూపొందించారు.
కపిల్ దేవ్ కిడ్నాప్
కపిల్ దేవ్ కిడ్నాప్

కపిల్ దేవ్ కిడ్నాప్

Kapil Dev Kidnap: ఇండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ ను చేతులు, నోరు కట్టేసి కిడ్నాప్ చేస్తున్న ఓ వీడియో సోమవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచి తెగ వైరల్ అయింది. అయ్యో.. కపిల్ దేవ్ కు ఏమైంది? అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు? కపిల్ సురక్షితంగానే ఉన్నాడా అంటూ సాధారణ అభిమానులతోపాటు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

కానీ కపిల్ దేవ్ కిడ్నాప్ వీడియో వెనుక అసలు స్టోరీ ఏంటో మంగళవారం (సెప్టెంబర్ 26) తెలిసింది. ఈసారి వరల్డ్ కప్ ను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేస్తున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. తన ప్రమోషన్లో భాగంగా ఈ వీడియోను క్రియేట్ చేయడం విశేషం. అయితే ఒక రోజు ముందు చిన్న టీజర్ వదిలి అభిమానులను కంగారు పెట్టింది.

కపిల్ కిడ్నాప్ డ్రామా

కపిల్ దేవ్ ను ఇద్దరు వ్యక్తులు కట్టేసి ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న చిన్న వీడియో సోమవారం వైరల్ అయింది. అయితే పూర్తి వీడియో మంగళవారం బయటకు వచ్చింది. ఇందులో ఏముందంటే.. వరల్డ్ కప్ జరుగుతున్నన్ని రోజులు కరెంట్ తీయకూడదన్న డిమాండ్ తో కొందరు గ్రామస్థులు కపిల్ ను కిడ్నాప్ చేస్తారు. అతన్ని విడిపించడానికి పోలీసులు రాగా.. వాళ్లకు తమ డిమాండ్ ఏంటో చెబుతారు.

అయినా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తుంటే.. కరెంటుతో పనేంటని సదరు పోలీస్ ఆఫీసర్ అంటాడు. మరి డేటా ఎవరిస్తారు అని కిడ్నాపర్లు అడుగుతారు. డేటా సేవింగ్ మోడ్ లో కూడా మ్యాచ్ లు చూడొచ్చని చెప్పడంతో అవునా అంటూ కిడ్నాపైన కపిల్ నే వాళ్లు అడుగుతారు. అవునంటూ అతడు తలూపడంతో వాళ్లు కట్లు విప్పుతారు. కిడ్నాప్ కథ సుఖాంతమవుతుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లన్నీ ఫ్రీగా చూడొచ్చని చెప్పే ప్రమోషన్లలో భాగంగా చేసిన ఈ ఫేక్ కిడ్నాప్ వీడియో భారత అభిమానులను కలవరపెట్టింది. అసలు విషయం తెలియడంతో గంభీర్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. అతడు కూడా ఈ పూర్తి వీడియోను షేర్ చేశాడు.

"అరె కపిల్ దేవ్ పాజీ యాక్టింగ్ వరల్డ్ కప్ కూడా మీరే గెలుచుకున్నారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫ్రీ అని ఎప్పుడూ గుర్తుండిపోతుంది" అనే క్యాప్షన్ తో గంభీర్ ఈ వీడియో పోస్ట్ చేశాడు.

కపిల్ దేవ్ కెప్టెన్సీలోనే తొలిసారి 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 28 ఏళ్లకు 2011లో స్వదేశంలో కప్పు గెలవగా.. మళ్లీ 12 ఏళ్లకు ఇప్పుడు ఇండియాలోనే వరల్డ్ కప్ జరుగుతోంది. దీంతో ఈసారి కూడా కప్పు గెలవాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తదుపరి వ్యాసం