Gambhir KKR: మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు గంభీర్.. షారుక్ ఖాన్‌ను అందుకే కలిశాడా?
Gambhir KKR: మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు గంభీర్ వెళ్తాడా? షారుక్ ఖాన్‌ను అతడు అందుకే కలిశాడా? ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gambhir KKR: ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌తో గౌతమ్ గంభీర్ కు మంచి అనుబంధం ఉంది. ఆ టీమ్ కు కెప్టెన్ గా 2012, 2014లలో రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించి పెట్టాడు గంభీర్. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా ఉన్న అతడు.. మళ్లీ కేకేఆర్ టీమ్ కు వెళ్తున్నాడా అన్న వార్తలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా గురువారం (సెప్టెంబర్ 21) కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ ను గంభీర్ కలవడం ఈ వార్తలకు తెరలేపింది. ఐపీఎల్లోకి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ వచ్చినప్పటి నుంచీ ఆ జట్టు మెంటార్ గా గంభీర్ కొనసాగుతున్నాడు. అయితే ఎల్ఎస్‌జీకి గుడ్ బై చెప్పి అతడు మళ్లీ కేకేఆర్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన గంభీర్.. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగానూ ఉన్న విషయం తెలిసిందే.
ముంబైలోని షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లిన గంభీర్.. అతనితో కాసేపు మాట్లాడాడు. దీంతో అతడు మళ్లీ కేకేఆర్ టీమ్ తో చేరనున్నట్లు జాగరన్ న్యూస్ వెల్లడించింది. అయితే గంభీర్ 2024 ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండబోడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇండియాలో ఎన్నికలు ఉండటంతో ఆ పనుల్లో గౌతీ బిజీగా ఉండనున్నాడు.
ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఉన్న గంభీర్.. మరోసారి ఆ పదవి కోసం పోటీ పడనున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకున్నా.. గంభీర్ మాత్రం ఎల్ఎస్‌జీతోనే ఉంటాడనీ ఆ మధ్య క్రికెట్‌నెక్ట్స్ తన రిపోర్టులో తెలిపింది. నిజానికి గంభీర్ మెంటార్ గా ఉన్న రెండు సీజన్లలోనూ లక్నో టీమ్ ప్లేఆఫ్స్ చేరింది.
అయితే షారుక్ ఖాన్ తో మీటింగ్ నేపథ్యంలో గంభీర్ ప్రస్తుత ఫ్రాంఛైజీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫొటోను గంభీరే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "అతడు కేవలం బాలీవుడ్ కింగ్ కాదు మనసులు గెలుచుకున్న కింగ్. అతన్ని కలిసిన ప్రతిసారీ ఎంతో ప్రేమ, గౌరవంతో తిరిగి వెళ్తాను. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి" అని గంభీర్ రాయడం విశేషం. అయితే కేకేఆర్ టీమ్ కి తిరిగి వెళ్లడంపై మాత్రం గంభీర్ కానీ, ఆ ఫ్రాంఛైజీగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టాపిక్