తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jos Buttler: జోస్ ది బాస్.. ఈడెన్‍లో అద్భుత అజేయ సెంచరీతో రాజస్థాన్‍ను గెలిపించిన బట్లర్.. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్

Jos Buttler: జోస్ ది బాస్.. ఈడెన్‍లో అద్భుత అజేయ సెంచరీతో రాజస్థాన్‍ను గెలిపించిన బట్లర్.. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్

17 April 2024, 8:22 IST

    • KKR vs RR - Jos Buttler : రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుత శతకంతో దుమ్ముపేపాడు. కోల్‍కతాపై రాజస్థాన్‍ను ఒంటి చేత్తో గెలిపించాడు. ధనాధన్ బ్యాటింగ్‍తో ఆర్ఆర్‌ను ఓటమి నుంచి గెలుపు వరకు తీసుకొచ్చాడు.
జోస్ ది బాస్.. ఈడెన్‍లో అద్భుత అజేయ సెంచరీతో రాజస్థాన్‍ను గెలిపించిన బట్లర్
జోస్ ది బాస్.. ఈడెన్‍లో అద్భుత అజేయ సెంచరీతో రాజస్థాన్‍ను గెలిపించిన బట్లర్ (Photo: X)

జోస్ ది బాస్.. ఈడెన్‍లో అద్భుత అజేయ సెంచరీతో రాజస్థాన్‍ను గెలిపించిన బట్లర్

KKR vs RR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ జోస్ బట్లర్ అద్భుత శకతంతో చెలరేగాడు. భారీ లక్ష్యఛేదనలో ఒంటరి పోరాటంతో అజేయ సెంచరీ చేసి కోల్‍కతాపై రాజస్థాన్‍ను ఒంటి చేత్తో గెలిపించాడు. మరోసారి ‘జోస్ ది బాస్’ అనిపించాడు. 60 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేశాడు బట్లర్. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో బట్లర్ దుమ్మురేపాడు. ఓటమి అంచుల నుంచి రాజస్థాన్ గెలుపు తీరం దాటించాడు. దీంతో ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నేడు (ఏప్రిల్ 16) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్‌ 2 వికెట్ల తేడాతో హోం టీమ్ కోల్‍కతా నైట్‍రైడర్స్ (కేకేఆర్) జట్టుపై గెలిచింది. చివరి బంతికి ఆర్ఆర్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను నిలబెట్టుకుంది. అలాగే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యఛేదనను మళ్లీ చేసి చరిత్ర సృష్టించింది రాజస్థాన్.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్‍రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109 పరుగులు; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) తన కెరీర్లో తొలి శతకంతో చెలరేగాడు. లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ శకతంతో చెలరేగి జట్టును గెలిపించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా బట్లర్ ఒంటరి పోరుతో దుమ్మురేపాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది రాజస్థాన్. చివరి బంతికి విన్నింగ్ రన్ కొట్టి గెలిపించాడు బట్లర్. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34 పరుగులు), రవ్మన్ పావెల్ (13 బంతుల్లో 26 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కోల్‍కతా బౌలర్లలో సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు.

బట్లర్ వీరోచిత పోరాటం

భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (9 బంతుల్లో 19 రన్స్) ఉన్నంతలో వేగంగా ఆడాడు. జోస్ బట్లర్ ఆరంభంలో నిలకడగా ఆడి ఆ తర్వాత దూకుడు పెంచాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (12) త్వరగానే ఔటవగా.. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34 రన్స్) దూకుడుగా ఆడాడు. అయితే, ధృవ్ జురెల్ (2), రవిచంద్రన్ అశ్విన్ (8), షిమ్రాన్ హిట్మైర్ (0) విఫలమవటంతో రాజస్థాన్‍కు భారీ దెబ్బ పడింది.

బట్లర్ మాత్రం పోరాడుతూ వెళ్లాడు. రావ్మన్ పావెల్ (13 బంతుల్లో 26 పరుగులు) కీలక సమయంలో భారీ హిట్టింగ్ చేశాడు. అయితే, అతడిని 17వ ఓవర్లో నరైన్ ఔట్ చేశాడు. బట్లర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వెళ్లాడు.

ఆరు ఓవర్ల విధ్వంసం

గెలువాలంటే ఆఖరి ఆరు ఓవర్లలో రాజస్థాన్ 96 పరుగులు చేయాల్సి వచ్చింది. విజయం కష్టమే అనిపించింది. అయితే, జోస్ బట్లర్ బీస్ట్ మోడ్‍కు వచ్చాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 15వ ఓవర్లో నాలుగు ఫోర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తంగా 17 రన్స్ వచ్చాయి. తర్వాత రసెల్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లోనూ 17 పరుగులు పిండుకున్నాడు. నరైన్ వేసిన 17వ ఓవర్లో రావ్మన్ పావెల్ ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గతిని మార్చాడు. అయితే, అదే ఓవర్లో అతడు ఔటయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో రాజస్థాన్ 46 పరుగులు చేయాల్సి వచ్చింది. జోరు కొనసాగించిన బట్లర్.. స్టార్క్ వేసిన 17వ ఓవర్లోనూ కుమ్మేశాడు. సిక్స్, ఫోర్ కొట్టాడు. దానికి తోడు ఐదు వైడ్స్ సమర్పించుకున్నాడు స్టార్క్. దీంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత స్ట్రైకింగ్ మొత్తం తన వద్దే పెట్టుకున్నాడు బట్లర్. హర్షిత్ రాణా వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాది రాజస్థాన్‍ను గెలుపు అంచుకు తెచ్చాడు. ఆ 19వ ఓవర్లో 19 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా.. వరుణ్ చక్రవర్తి వేసిన తొలి బంతినే సిక్సర్ బాదేశాడు బట్లర్. దీంతో 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు మూడు పరుగులు అవసరమైన సమయంలో వరుసగా మూడు డాట్ బాల్స్ పడటంతో టెన్షన్ పెరిగింది. అయితే ఐదో బంతికి డబుల్ తీసిన బట్లర్.. ఆఖరి బాల్‍కు సింగిల్ సాధించి రాజస్థాన్‍ను గెలిపించాడు. వీరిచిత పోరాటంతో అద్భుతం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకానొక బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఐపీఎల్‍లో బట్లర్‌కు ఇది ఏడో శతకం. ఐపీఎల్ అత్యధిక సెంచరీ జాబితాలో క్రిస్ గేల్‍ (6)ను దాటి రెండో స్థానంలోకి బట్లర్ వచ్చేశాడు. 8 ఐపీఎల్ సెంచరీలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నాడు.

నరైన్ సూపర్ శతకం

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది కోల్‍కతా నైట్ రైడర్స్. మరోసారి ఓపెనర్‌గా వచ్చిన స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ శకతంతో దుమ్మురేపాడు. 56 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌లు బాది 109 పరుగులు చేశాడు. తన కెరీర్లోనే తొలి శకతం సాధించాడు నరైన్. రాజస్థాన్ బౌలర్లను బాదేసి చుక్కలు చూపాడు. ఇక మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10) విఫలమవగా.. అంగ్‍క్రిష్ రఘువంశీ (18 బంతుల్లో 30 రన్స్) ఉన్నంతసేపు దీటుగా ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11), ఆండ్రీ రసెల్ (13) విఫలమయ్యారు. అయితే, మరో ఎండ్‍లో సునీల్ నరైన్ మాత్రం బాదుడు కొనసాగించారు. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన శైలికి భిన్నంగా గాల్లోకి ఎగురుతూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. 18వ ఓవర్లో నరైన్‍ను రాజస్థాన్ పేసర్ బౌల్ట్ ఔట్ చేశాడు. ఐపీఎల్‍ చరిత్రలో రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ తర్వాత హ్యాట్రిక్ తీసుకొని, సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు.

చివర్లో రింకూ సింగ్ (9 బంతుల్లో 20 రన్స్ నాటౌట్) దూకుడుగా ఆడాడు. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది కోల్‍కతా. రాజస్థాన్ పేసర్లు అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

చరిత్ర సృష్టించిన రాజస్థాన్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యఛేదన రికార్డును మరోసారి సృష్టించింది రాజస్థాన్. 2020 సీజన్‍లో పంజాబ్‍పై రాజస్థాన్ 224 పరుగులను ఛేదించి.. ఐపీఎల్‍లో హయ్యెస్ట్ రన్ చేజ్ రికార్డును సాధించింది. ఇప్పుడు ప్రస్తుత సీజన్‍లో కోల్‍కతాపై కూడా 224 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఐపీఎల్ అత్యధిక లక్ష్యఛేదనను మరోసారి నమోదు చేసింది. ఈ జాబితాలో మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. 2019లో చెన్నైపై 219 రన్స్ చేజ్ చేసింది ముంబై.

ప్లే ఆఫ్స్‌కు సమీపంలో..

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచిన రాజస్థాన్ 12 పాయింట్లతో నిలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు అత్యంత సమీపంలో ఉంది. కోల్‍కతా నైట్‍రైడర్స్ టీమ్ 6 మ్యాచ్‍లో రెండు ఓడి, నాలుగు గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగింది.

తదుపరి వ్యాసం