తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Kkr Final Xi: చెన్నై తుది జట్టులోకి మళ్లీ వచ్చేసిన ముస్తాఫిజుర్.. మరో రెండు మార్పులు కూడా..

CSK vs KKR Final XI: చెన్నై తుది జట్టులోకి మళ్లీ వచ్చేసిన ముస్తాఫిజుర్.. మరో రెండు మార్పులు కూడా..

08 April 2024, 19:21 IST

    • CSK vs KKR IPL 2024: కోల్‍కతా నైట్‍రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ఈ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది చెన్నై.
CSK vs KKR Final XI: చెన్నై తుది జట్టులోకి మళ్లీ వచ్చేసిన ముస్తాఫిజుర్
CSK vs KKR Final XI: చెన్నై తుది జట్టులోకి మళ్లీ వచ్చేసిన ముస్తాఫిజుర్

CSK vs KKR Final XI: చెన్నై తుది జట్టులోకి మళ్లీ వచ్చేసిన ముస్తాఫిజుర్

CSK vs KKR: ఐపీఎల్ 2024లో రెండు వరుస పరాజయాల తర్వాత మరోసారి హోం గ్రౌండ్‍లో బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే). ఈ సీజన్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచిన చెన్నై ఆ తర్వాత వెనుకబడింది. మళ్లీ గెలుపు బాట పట్టాలని కసిగా ఉంది. హ్యాట్రిక్ గెలుపులతో జోష్‍లో ఉన్న కోల్‍కతా నైట్‍రైడర్స్ (కేకేఆర్) జట్టును ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 8) సీఎస్‍కే, కేకేఆర్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

చెన్నైలో మూడు మార్పులు

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఓ మ్యాచ్ గ్యాప్ తర్వాత.. మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులోకి వచ్చేశాడు. మోయిన్ అలీని తప్పించి ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో రహమాన్‍ను చెన్నై తీసుకుంది. దీపక్ చాహర్ స్పల్ప ఇబ్బందితో ఉండటంతో ఈ మ్యాచ్‍లో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నట్టు చెన్నై కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. అలాగే, యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వి కూడా సీఎస్‍కే జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. పేసర్ మతీష పతిరణ ఇంకా అందుబాటులోకి రాలేదు.

హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న కోల్‍కతా నైట్ రైడర్స్.. గత మ్యాచ్ ఆడిన తుది జట్టునే కంటిన్యూ చేసింది. హెడ్ టూ హెడ్ రికార్డులన్నీ గతమని, ఇప్పుడు విభిన్నమైన టీమ్, పరిస్థితులు ఉన్నాయని టాస్ సమయంలో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రహమాన్, తుషార్ దేశ్‍పాండే, మహీష్ తీక్షణ

చెన్నై సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: శివం దూబే, మొయిన్ అలీ, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, నిషాంత్ సింధు

కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్టు: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరేన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్‍క్రిష్ రఘువంశీ, ఆండ్రే రసెల్, రింకూ సింగ్, రమణ్‍దీప్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

కోల్‍కతా సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుయాశ్ శర్మ, అనుకూల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, షేక్ హుసేన్

ఐపీఎల్ 2024 సీజన్‍లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి జోరు చూపింది. హోం గ్రౌండ్ చెపాక్‍లో జరిగిన రెండు మ్యాచ్‍ల్లోనూ విజయం సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో జరిగిన మ్యాచ్‍ల్లో పరాజయం పాలైంది. వైజాగ్‍లో సీఎస్‍కేను ఢిల్లీ ఓడించగా.. హైదరాబాద్‍లో ఎస్‍ఆర్‌హెచ్ ఖంగుతినిపించింది. దీంతో ఒక్కసారిగా చెన్నై వెనుకంజలో పడిపోయింది. అయితే, నేడు కోల్‍కతాతో హోం గ్రౌండ్‍లో జరిగే పోరులో సత్తాచాటి మళ్లీ గెలుపు బాటపట్టాలని సీఎక్‍కే పట్టుదలగా ఉంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా రావటంతో ఈ సీజన్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ దూకుడుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వరుసగా మూడు మ్యాచ్‍ల్లో గెలిచింది.

తదుపరి వ్యాసం