DC vs KKR: వైజాగ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ.. కాస్తలో బతికిపోయిన సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు-dv vs kkr kolkata knight riders register second highest score in ipl history srh record stays by small margin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dc Vs Kkr: వైజాగ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ.. కాస్తలో బతికిపోయిన సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు

DC vs KKR: వైజాగ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ.. కాస్తలో బతికిపోయిన సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు

Apr 03, 2024, 09:57 PM IST Chatakonda Krishna Prakash
Apr 03, 2024, 09:53 PM , IST

  • DC vs KKR IPL 2024: తెలుగు గడ్డపై ఐపీఎల్ 2024 సీజన్‍లో మరోసారి పరుగుల వరద పారింది. విశాఖపట్నం వేదికగా నేడు (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ దుమ్మురేపింది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు చేసింది కోల్‍కతా. కాస్తలో సన్‍రైజర్స్ హైదరాబాద్ రికార్డు బతికిపోయింది. వివరాలివే.. 

ఐపీఎల్ 2024 సీజన్‍లో విశాఖపట్నం వేదికగా నేడు (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 272 పరుగులు చేసింది. 

(1 / 6)

ఐపీఎల్ 2024 సీజన్‍లో విశాఖపట్నం వేదికగా నేడు (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ పరుగుల సునామీ సృష్టించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 272 పరుగులు చేసింది. (KKR)

ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు చేసింది కోల్‍కతా. కేవలం ఐదు పరుగుల తేడాతో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) రికార్డు బతికిపోయింది. 

(2 / 6)

ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు చేసింది కోల్‍కతా. కేవలం ఐదు పరుగుల తేడాతో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) రికార్డు బతికిపోయింది. (KKR)

ఈ సీజన్‍లోనే ముంబై ఇండియన్స్ జట్టుపై 277 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును సన్‍రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పింది. హైదరాబాద్ వేదికగా ఎస్‍ఆర్‌హెచ్ ఆ అద్భుతం చేసింది. అయితే, దాన్ని ఢిల్లీపై ఈ మ్యాచ్‍లో కోల్‍కతా బద్దలుకొట్టేలా కనిపించింది. అయితే, 5 రన్స్ దూరంలో ఆగిపోయింది.

(3 / 6)

ఈ సీజన్‍లోనే ముంబై ఇండియన్స్ జట్టుపై 277 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును సన్‍రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పింది. హైదరాబాద్ వేదికగా ఎస్‍ఆర్‌హెచ్ ఆ అద్భుతం చేసింది. అయితే, దాన్ని ఢిల్లీపై ఈ మ్యాచ్‍లో కోల్‍కతా బద్దలుకొట్టేలా కనిపించింది. అయితే, 5 రన్స్ దూరంలో ఆగిపోయింది.(AP)

కోల్‍కతా ఆల్‍రౌండర్ సునీల్ నరేన్ 39 బంతుల్లోనే 85 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు భీకర హిట్టింగ్‍తో చెమటలు పట్టించాడు. 

(4 / 6)

కోల్‍కతా ఆల్‍రౌండర్ సునీల్ నరేన్ 39 బంతుల్లోనే 85 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు భీకర హిట్టింగ్‍తో చెమటలు పట్టించాడు. (AFP)

నరేన్‍తో పాటు అంగ్‍క్రిష్ రఘువంశీ (27 బంతుల్లో 54 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రే రసెల్ (19 బంతుల్లో 41 పరుగులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26 పరుగులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ ఆటతో దుమ్మురేపారు. దీంతో కోల్‍కతా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

(5 / 6)

నరేన్‍తో పాటు అంగ్‍క్రిష్ రఘువంశీ (27 బంతుల్లో 54 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రే రసెల్ (19 బంతుల్లో 41 పరుగులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26 పరుగులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ ఆటతో దుమ్మురేపారు. దీంతో కోల్‍కతా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.(AFP)

మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది కోల్‍కతా నైట్‍రైడర్స్. ఢిల్లీ ముందు 273 పరుగుల కొండంత లక్ష్యం ఉంది. 

(6 / 6)

మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది కోల్‍కతా నైట్‍రైడర్స్. ఢిల్లీ ముందు 273 పరుగుల కొండంత లక్ష్యం ఉంది. (AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు