తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Chennai Super Kings: హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. ఈ సీజన్‍లో కోల్‍కతాకు తొలి ఓటమి

Chennai Super Kings: హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. ఈ సీజన్‍లో కోల్‍కతాకు తొలి ఓటమి

08 April 2024, 23:17 IST

    • CSK vs KKR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‍కతా నైట్‍రైజర్స్‌ను చిత్తుచేసింది. హోం గ్రౌండ్‍లో ఆల్ రౌండ్ షో చేసి సత్తాచాటింది. అలవోకగా గెలిచింది చెన్నై.
Chennai Super Kings: హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. ఈ సీజన్‍లో కోల్‍కతాకు తొలి ఓటమి
Chennai Super Kings: హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. ఈ సీజన్‍లో కోల్‍కతాకు తొలి ఓటమి (PTI)

Chennai Super Kings: హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. ఈ సీజన్‍లో కోల్‍కతాకు తొలి ఓటమి

CSK vs KKR IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో మళ్లీ గెలుపు బాటపట్టింది చెన్నై సూపర్ కింగ్స్. రెండు వరుస ఓటముల తర్వాత మళ్లీ సత్తాచాటి విజయం సాధించింది. హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో మరోసారి గర్జించి ఈ సీజన్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా నేడు (ఏప్రిల్ 8) కోల్‍కతా నైట్ రైడర్స్ టీమ్‍తో జరిగిన మ్యాచ్‍లో సీఎక్‍కే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండ్ షో చేసి అలవోకగా గెలిచింది. ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతాకు ఇది తొలి ఓటమిగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

అదరగొట్టిన చెన్నై బౌలర్లు

ఈ మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సత్తాచాటి ఈ సీజన్‍లో జోరు మీద ఉన్న కోల్‍కతా నైట్ రైడర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. చెన్నై స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లతో రాణించాడు. తుషార్ దేశ్‍పాండే మూడు, ముస్తాఫిజుర్ రహమాన్ రెండు వికెట్లతో సత్తాచాటారు. తీక్షణ పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. చెన్నై బౌలర్లు సమిష్టిగా సత్తాచాటటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయలిగింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34), సునీల్ నరేన్ (27) మినహా మిలిగిన బ్యాటర్లు విఫలమయ్యారు.

ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0)ను ఈ మ్యాచ్‍లో తొలి బంతికే ఔట్ చేశాడు చెన్నై పేసర్ దేశ్‍పాండే. సునీల్ నరేన్ (27), అంగ్‍క్రిష్ రఘువంశీ (24), వెంకటేశ్ అయ్యర్ (3)ను జడేజా ఔట్ చేశాడు. రింకూ సింగ్ (9), డేంజరస్ ఆండ్రే రసెల్ (10)ను త్వరగా పెవిలియన్ పంపి అదరగొట్టాడు దేశ్‍పాండే. వరుసగా వికెట్లు కోల్పోయిన కోల్‍కతా పెద్ద స్కోరు చేయలేకపోయింది.

రుతురాజ్ చివరి వరకు నిలిచి..

ఈ మోస్తరు లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 14 బంతులను మిగిల్చి మరీ ఛేదించింది. 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయం సాధించింది చెన్నై. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్) అర్ధ శతకంతో చివరి వరకు నిలిచాడు. డారిల్ మిచెల్ (25), శివమ్ దూబే (28) కూడా రాణించారు. 18 బంతుల్లోనే 3 సిక్స్‌లు, ఓ ఫోర్‌తో దూకుడుగా ఆడాడు దూబే. 45 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరిన గైక్వాడ్.. చివరి వరకు నిలిచి బాధ్యతగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

జడేజాను ఆపి.. వచ్చిన ధోనీ

శివమ్ దూబే ఔటయ్యాక.. రవీంద్ర జడేజా బ్యాటింగ్‍కు దిగేందుకు రెడీ అయ్యాడు. గ్రౌండ్‍లోకి వెళ్లేందుకు నిల్చున్నాడు. అయితే, ఆ సమయంలో జడేజాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (1 నాటౌట్) బ్యాటింగ్‍కు వచ్చాడు. హోం గ్రౌండ్‍లో తన బ్యాటింగ్ చూడాలని ఆశగా ఉన్న అభిమానుల కోసం మహీ బరిలోకి దిగాడు. ధోనీ గ్రౌండ్‍లోకి వచ్చిన సమయంలో చెపాక్ స్టేడియంలో మోతెక్కించారు ప్రేక్షకులు.

ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా మూడు విజయాలతో జోష్‍ చూపిన కోల్‍కతాకు ఇదే తొలి ఓటమి. ప్రస్తుతం ఆరు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కేకేఆర్ ఉంది. ఐదు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. నాలుగో స్థానంలో ఉంది.

ఐపీఎల్‍లో రేపు (ఏప్రిల్ 9) సన్‍రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ముల్లాన్‍పూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

తదుపరి వ్యాసం