తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ben Stokes: బెన్ స్టోక్స్ మళ్లీ వచ్చాడు.. రిటైర్మెంట్‌కు గుడ్‌బై.. వరల్డ్‌కప్ ఆడనున్న స్టార్ ప్లేయర్

Ben Stokes: బెన్ స్టోక్స్ మళ్లీ వచ్చాడు.. రిటైర్మెంట్‌కు గుడ్‌బై.. వరల్డ్‌కప్ ఆడనున్న స్టార్ ప్లేయర్

Hari Prasad S HT Telugu

16 August 2023, 15:35 IST

    • Ben Stokes: బెన్ స్టోక్స్ మళ్లీ వచ్చాడు. వన్డే క్రికెట్ రిటైర్మెంట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన అతడు.. వరల్డ్‌కప్ 2023లోనూ ఆడనున్నాడు.
బెన్ స్టోక్స్
బెన్ స్టోక్స్ (Getty)

బెన్ స్టోక్స్

Ben Stokes: వన్డే వరల్డ్ కప్ 2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ కు గుడ్ న్యూస్. ఆ టీమ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఈ ఫార్మాట్లో ఆడనున్నాడు. గతేడాది జులైలో ఈ ఫార్మాట్ కు అతడు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ కు మరో 50 రోజుల ముందు యూటర్న్ తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

ఈ నెల చివర్లో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ కు ముందు స్టోక్స్ కు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనికి ఈ సిరీస్ లో అవకాశం కల్పించింది. స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో అతన్ని జట్టులోకి ఎంపిక చేసినట్లు ఈసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

2019లో ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలవడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లోనూ ఒంటరిపోరాటంతో స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వలేనంటూ గతేడాది వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.

మోకాలి గాయంతో ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా వరకూ మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టోక్స్.. యాషెస్ సిరీస్ తో మళ్లీ గాడిలో పడ్డాడు. ఇప్పుడతడు వన్డే జట్టులోకి తిరిగి రావడంతో ఇంగ్లండ్ వరల్డ్ కప్ డిఫెన్స్ పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. స్టోక్స్ మ్యాచ్ లను గెలిపించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఇంగ్లండ్ జట్టును మరింత బలోపేతం చేస్తాయని ఈసీబీ చీఫ్ సెలక్టర్ ల్యూక్ రైట్ అభిప్రాయపడ్డాడు.

2019 వరల్డ్ కప్ లో స్టోక్స్ 465 పరుగులు చేయడతోపాటు 7 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లోనూ 98 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ చివరికి టై అవగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులోనూ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు బాదిన జట్టుగా ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు.

తదుపరి వ్యాసం