Beer Controversy : ఇంగ్లండ్ రెస్ట్‌రూమ్‌ ముందు బీర్ పట్టుకుని గంటసేపు చూశాం.. స్టీవ్ స్మిత్-cricket news steve smith breaks silence on post ashes beer controversy ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Cricket News Steve Smith Breaks Silence On Post Ashes Beer Controversy

Beer Controversy : ఇంగ్లండ్ రెస్ట్‌రూమ్‌ ముందు బీర్ పట్టుకుని గంటసేపు చూశాం.. స్టీవ్ స్మిత్

Anand Sai HT Telugu
Aug 13, 2023 07:53 AM IST

Ashes Series 2023 : యాషెస్ సిరీస్ సందర్భంగా తాను ఎదుర్కొన్న పరిస్థితిని చెప్పాడు స్టీవ్ స్మిత్. పార్టీ చేసుకుందామంటే.. ఇంగ్లండ్ జట్టు తలుపు తీయలేదని వెల్లడించాడు.

స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్ (AP)

ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్(Ashes Series) జరిగింది. సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, 3వ, 5వ టెస్టుల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. 4వ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

యాషెస్ సిరీస్ డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియా ట్రోఫీని నిలబెట్టుకుంది. అంతే కాకుండా 22 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయిన ఆస్ట్రేలియా జట్టు బాధపడుతోంది. ప్రతి యాషెస్ సిరీస్ తర్వాత ఇరు జట్లు కలిసి కూర్చుని పార్టీ చేసుకోవడం ఆనవాయితీ.

గత యాషెస్ సిరీస్‌లో పెద్ద పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, సిరీస్ డ్రాగా ముగిసింది. రెండు జట్లు పార్టీ చేసుకోవాలనుకున్నాయి. సిరీస్ ముగింపును జరుపుకోవడానికి ఆస్ట్రేలియా, ఇంగ్లీషు ఆటగాళ్లు కలిసి బీరు తాగుతున్న చిత్రాలు గతంలోనివి ఉన్నాయి. అయితే ఈ యాషెస్‌ సిరీస్‌ ముగిసిన రోజున ఆటగాళ్లు బీరు తాగిన ఫోటోలు బయటకు రాలేదు.

దీనిపై చాలామందికి అనుమానం వచ్చింది. మరోవైపు స్టువర్ట్ బ్రాడ్, మోయిన్ అలీ పదవీ విరమణ కూడా చేశారు. రెండు జట్లూ డ్రెస్సింగ్ రూమ్‌లో బీర్ తాగలేకపోయాయి. 'అందుకే మేమంతా నైట్ క్లబ్ లో కలుద్దామనుకున్నాం.' అంటూ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదాన్ని ముగించాడు.

అయితే ఇక్కడ మరో విషయం జరిగింది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. 5వ టెస్టు తర్వాత మేం పర్యాటక జట్టు కావడంతో ఇంగ్లండ్ రెస్ట్ రూమ్‌కి వెళ్లాం. చాలా సేపటికి ఎవరూ తలుపు తీయలేదు. మేం బీర్ పట్టుకుని అక్కడే వేయిట్ చేశాం. తర్వాత బెన్ స్టోక్స్ 10 నిమిషాలు అని చెప్పాడని స్టీవ్ చెప్పుకొచ్చాడు.

అయితే అలా గంటకు పైగా వేచి చూసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ' ఇంగ్లండ్ జట్టు నైట్ క్లబ్‌లో కలుద్దామని చెప్పింది. అయితే అప్పుడు కూడా నాతో సహా కొంతమంది ఆటగాళ్లు ఇంటికి వచ్చారు. ఆట ఆడిన తర్వాత ఇరు జట్లు కలిసి కూర్చుని బీరు తాగ లేదు.' అని చెప్పాడు.

WhatsApp channel
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.