తెలుగు న్యూస్  /  career  /  Nit Warangal Recruitment 2024 : వరంగల్‌ 'నిట్'లో ఉద్యోగ ఖాళీలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

NIT Warangal Recruitment 2024 : వరంగల్‌ 'నిట్'లో ఉద్యోగ ఖాళీలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

28 November 2024, 19:08 IST

google News
    • NIT Warangal Recruitment 2024 : వరంగల్‌లోని నిట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. లైబ్రరీ ట్రైనీలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు నవంబర్ 30వ తేదీతో పూర్తి కానుంది. https://nitw.ac.in/Careers/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు

వరంగల్ నిట్ లో ఉద్యోగాలు

వరంగల్‌లోని ‘నిట్’ లో లైబ్రరీ ట్రైనీ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు నవంబర్ 30వ తేదీతో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా భాగంగా ఐదు లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

  • మొత్తం ఖాళీలు - 5
  • ఈ పోస్టులను తాత్కాలిక, కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో MLisc(Master of Library and Information Science) పూర్తి చేసి ఉండాలి.
  • ఎంపికై వారికి నెలకు రూ. 20వేల జీతం చెల్లిస్తారు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
  • 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ పూర్తి చేసి ఉండాలి.
  • జీతం - రూ. 20,000 చెల్లిస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ - నవంబర్ 30, 2024.
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం - రాత పరీక్ష లేదా ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచుతారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/
  • ఆన్ లైన్ దరఖాస్తులకు లింక్ - https://contractual.nitw.ac.in/register/
  • మెయిల్ అడ్రస్ - registrar@nitw.ac.in

తదుపరి వ్యాసం