తెలుగు న్యూస్  /  career  /  Ctet December 2024 : సీటెట్​ అభ్యర్థులకు కీలక అలర్ట్​! సిటీ ఇంటిమేషన్​ స్లిప్​ విడుదల..

CTET December 2024 : సీటెట్​ అభ్యర్థులకు కీలక అలర్ట్​! సిటీ ఇంటిమేషన్​ స్లిప్​ విడుదల..

Sharath Chitturi HT Telugu

03 December 2024, 12:59 IST

google News
    • CTET December 2024 : సీటెట్ డిసెంబర్ 2024 ఎగ్జామ్ సిటీ స్లిప్ విడుదలైంది. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ చెక్ చేసుకోవడానికి, డౌన్​లోడ్​ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీటెట్​ అభ్యర్థులకు కీలక అలర్ట్​!
సీటెట్​ అభ్యర్థులకు కీలక అలర్ట్​!

సీటెట్​ అభ్యర్థులకు కీలక అలర్ట్​!

సీటెట్​ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అభ్యర్థులకు అలర్ట్​! సీటెట్ డిసెంబర్ 2024 ఎగ్టామ్​ సిటీ స్లిప్​ని డిసెంబర్ 3న విడుదల చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్​కి హాజరయ్యే అభ్యర్థులు ctet.nic.in సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్​ని చెక్ చేసి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

సీటెట్​ 2024 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్​లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ అవసరం. ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్​లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

సీటెట్ డిసెంబర్ 2024 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

  • ctet.nic.in వద్ద సీటెట్​ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీటెట్ డిసెంబర్ 2024 ఎగ్జామ్ సిటీ స్లిప్ లింక్​పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడున్న లింక్​పై​ అభ్యర్థులు మళ్లీ క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేయాలి.
  • మీ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్​ప్లే అవుతుంది
  • సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ చెక్ చేసి డౌన్​లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.

ఈ ఏడాది సీటెట్ పరీక్ష డిసెంబర్ 14, 2024న జరగనుంది. పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుందని, మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

పేపర్-2 ఉదయం షిఫ్టులో, పేపర్-1 సాయంత్రం షిఫ్టులో నిర్వహిస్తారు. రెండు లెవల్స్​కి (1 నుంచి 5 తరగతులు, 6 నుంచి 8వ తరగతి వరకు) ఉపాధ్యాయుడు కావాలనుకునేవారు రెండు పేపర్లకు (పేపర్ 1, పేపర్ 2) హాజరు కావాల్సి ఉంటుంది.

ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

సిటీ స్లిప్​ అనంతరం సీటెట్​ డిసెంబర్​ 2024 అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్సైట్​లో విడుదల చేయనున్నారు. గత ట్రెండ్స్​నే కొనసాగిస్తే సీబీఎస్ఈ సీటెట్ అడ్మిట్ కార్డును పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు విడుదల చేస్తారు. సీటెట్ అడ్మిట్ కార్డు 2024 విడుదల తేదీ, సమయంపై అధికారిక వెబ్సైట్​లో ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.

అడ్మిట్​ కార్డు విడుదలైనప్పుడు మేము మీకు అప్డేట్​ చేస్తాము.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. జాబ్స్​, ఎడ్యుకేషన్​, కెరీర్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

తదుపరి వ్యాసం