HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zerodha: తమ బాస్ నితిన్ కామత్ కు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పిన జెరోధా

Zerodha: తమ బాస్ నితిన్ కామత్ కు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పిన జెరోధా

Sudarshan V HT Telugu

05 October 2024, 15:36 IST

  • Zerodha Nithin Kamath: జెరోధా తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నితిన్ కామత్ కు వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ తెలియజేసింది. అక్టోబర్ 5 నితిన్ కామత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లోని తమ అఫీషియల్ అకౌంట్ ద్వారా జెరోధా తమ బాస్ కు బర్త్ డే విషెస్ చెప్పింది.

 జెరోధా సీఈఓ నితిన్ కామత్
జెరోధా సీఈఓ నితిన్ కామత్

జెరోధా సీఈఓ నితిన్ కామత్

Zerodha Nithin Kamath: ప్రముఖ ఆన్ లైన్ బ్రోకరేజ్ ప్లాట్ ఫామ్ జెరోధా తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నితిన్ కామత్ కు ఈ సంవత్సరం వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అక్టోబర్ 5, శనివారం నితిన్ కామత్ పుట్టిన రోజు కావడంతో తమ బాస్ కు జెరోధా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లోని తమ అఫీషియల్ అకౌంట్ ద్వారా విషెస్ తెలియజేసింది.

"ప్రపంచంలోనే అత్యంత అందమైన బ్రోకర్"

"ప్రపంచంలోని అత్యంత అందమైన బ్రోకర్" అనే శీర్షికతో తమ బాస్ నితిన్ కామత్ కు జెరోధా బర్త్ డే విషెస్ తెలియజేసింది. ‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన బ్రోకర్ అయిన @nithin0dha కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా (Zerodha) ఎక్స్ లో పోస్ట్ చేసింది. జెరోధా తన పోస్ట్ లో నితిన్ కామత్ ను ప్రపంచంలోనే అత్యంత అందమైన స్టాక్ బ్రోకర్ గా పేర్కొంది. కామత్ వ్యక్తిగత హోమ్ పేజీ వెబ్సైట్ లింక్ ను కూడా షేర్ చేసింది. ఇందులో అతని వ్యక్తిగత జీవితం, అతని ఇష్టాలు, అతను ఇప్పుడు ఈ స్థాయికి చేరడానికి చేసిన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది.

జెరోధా ప్రారంభం

తన వ్యక్తిగత హోమ్ పేజ్ వెబ్ సైట్ లో తాను సగటు విద్యార్థినని, 17 ఏళ్ల వయసులో అనుకోకుండా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ (stock market) వైపు వెళ్లానని నితిన్ కామత్ పేర్కొన్నాడు. ‘‘2000 దశకం ప్రారంభంలో, నేను అప్పు చేసి నా ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించాను. ఆపై అప్పు తీర్చడానికి 4 సంవత్సరాలు కాల్ సెంటర్లో పనిచేశాను. అదే సమయంలో ట్రేడింగ్ కూడా చేశాను’’ అని నితిన్ కామత్ తన వ్యక్తిగత హోమ్ పేజీలో వివరించారు. రిలయన్స్ (reliance) మనీ అనే బ్రోకరేజీ సంస్థకు తాను ఫ్రాంచైజీగా మారి అడ్వయిజరీ ప్రారంభించానని కామత్ తెలిపారు. ఈ సమయంలో అతని తమ్ముడు నిఖిల్ కామత్ కూడా అతనితో జత కలిశాడు. తన తమ్ముడు ట్రేడింగ్ (trading) చేస్తుండటంతో ట్రేడర్లుగా తమకు అవసరమని భావించిన బ్రోకరేజీ సంస్థను నిర్మించడానికి కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెబ్సైట్ పేర్కొంది. 2010 లో, వారు జెరోధాను స్థాపించారు. బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించడానికి "తగినంత డబ్బును" సమీకరించారు. "మేము ఒక చిన్న బృందంగా ప్రారంభించాము. విద్యాపరంగా, సాంకేతికతంగా ఎటువంటి నేపథ్యం లేదు. అనుభవం లేదు. కానీ క్యాపిటల్ మార్కెట్ల పట్ల అభిరుచి, మా వంటి ఇతర వ్యాపారులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యం మాత్రం ఉంది’’ అని నితిన్ కామత్ చెప్పారు. జెరోధా రూ.8,320 కోట్ల ఆదాయం, రూ.4,700 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సెప్టెంబర్ 25న మింట్ నివేదించింది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్