తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nithin Kamath Health : ఫిట్​గా ఉండే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు!

Nithin Kamath health : ఫిట్​గా ఉండే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు!

Sharath Chitturi HT Telugu

26 February 2024, 15:36 IST

  • Nithin Kamath heart attack : జెరోధా కో-ఫౌండర్​, సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు వచ్చింది. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారిలో నితిన్​ కామత్​ ఒకరు!

ఫిట్​గా ఉండే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు!
ఫిట్​గా ఉండే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు!

ఫిట్​గా ఉండే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​కు స్వల్ప గుండెపోటు!

Nithin Kamath health : ఎల్లప్పుడు ఫిట్​గా ఉంటూ, ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ స్టాక్​ బ్రోకరేజ్​ సంస్థ జెరోధా కో-ఫౌండర్​, సీఈఓ నితిన్​ కామత్​ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆరు వారాల క్రితం.. మైల్డ్​ స్ట్రోక్​తో ఆరోగ్యం దెబ్బతినట్టు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

ఆరు వారాల క్రితం.. నితిన్​ కామత్​కు స్ట్రోక్​!

"ఆరు వారాల క్రితం.. అనూహ్యంగా నాకు స్వల్ప గుండెపోటు వచ్చింది. తండ్రి మరణించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసిపోవడం, డీహైడ్రేషన్​, ఎక్కువగా వర్కౌట్స్​ చేయడం.. వీటిల్లో ఏదో ఒకటి కారణం అవ్వొచ్చు," అని సోమవారం.. ఓ ట్వీట్​ చేశారు 44ఏళ్ల నితిన్​ కామత్​.

తన ముఖం పొడిబారినట్టు, అప్పటి నుంచి చదవడం- రాయడం కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు జెరోధా కో-ఫౌండర్​ నితిన్​ కామత్​. పూర్తిగా రికవర్​ అవ్వడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు.

Zerodha CEO Nithin Kamath : "ముఖంలో చాలా మార్పులు కనిపించాయి. గతంలో చదవడానికి, రాయడానికి వచ్చేది కాదు. ఇప్పుడు కాస్త బాగుంది. మెదడు సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు బాగుంది. రికవరీకి 3 నుంచి 6 నెలల పాటు సమయం పడుతుంది," అని స్పష్టం చేశారు నితిన్​ కామత్​.

ఇదీ చూడండి:- Zerodha CEO: ‘‘సొంత ఇల్లు కొనడం బెటరా? రెంట్ కు ఉండడం బెటరా?’’.. జెరోధా సీఈఓ లెక్కకు నెటిజన్లు ఫిదా..

ఫిట్​నెస్​కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే వారిలో నితిన్​ కామత్​ ఒకరు. ఆయన చాలా ఫిట్​గా ఉంటారు. స్టాక్​ మార్కెట్​ కన్నా.. ఆరోగ్యంపైనే అధిక దృష్టిపెట్టాలని కూడా చాలా సందర్భాల్లో యువతకు మెసేజ్​ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయనకు మైల్డ్​ స్ట్రోక్​ రావడం.. సర్వత్రా చర్చకు దారితీసింది. అంత ఫిట్​గా ఉండే మనిషికి కూడా స్ట్రోక్​ వస్తోందేంటని చర్చలు జరుగుతున్నాయి.

Nithin Kamath mild stroke : అయితే.. తనకు మైల్డ్​ స్ట్రోక్​ వచ్చిన తర్వాత.. తన హాబిట్స్​, అలవాట్లపై మళ్లీ దృష్టిపెట్టినట్టు, ఎవైనా మార్చుకునేవి ఉంటే.. మార్చుకుంటాని జెరోధా నితిన్​ కామత్​ తెలిపాు.

"నిత్యం ఫిట్​గా ఉండి, తన గురించి తాను కేర్​ తీసుకునే వారికి ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు నెమ్మదించాలో మనకి కచ్చితంగా తెలియాలి అని డాక్టర్లు చెబుతున్నారు. కాస్త బాధగా ఉంది. కానీ రికవర్​ అవుతున్నాను. ట్రెడ్​మిల్​ కౌంట్​ని పెంచుతున్నాను," అని నితిన్​ కామత్​ వివరించారు.

Nithin Kamath latest news : జెరోధా బ్రెదర్స్​గా గుర్తింపు పొందిన నితిన్​ కామత్​, నికిల్​ కామత్​లు.. సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారు. యువతకు ఫైనాన్స్​, హెల్త్​తో పాటు ఇతర విషయాల్లో కీలక టిప్స్​ ఇస్తూ ఉంటారు. పాడ్​కాస్ట్​లు కూడా నిర్వహించి.. హెల్తీ లైఫ్​స్టైల్​కి ఉన్న అవసరాన్ని ప్రమోట్​ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు.. నితిన్​ కామత్​ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు మెసేజ్​లు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం