Brinjal: వంకాయలను తక్కువగా చూడకండి, ఇది గుండెపోటును అడ్డుకుంటుంది తెలుసా?-brinjal eating eggplants can prevent heart attacks and has many other health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinjal: వంకాయలను తక్కువగా చూడకండి, ఇది గుండెపోటును అడ్డుకుంటుంది తెలుసా?

Brinjal: వంకాయలను తక్కువగా చూడకండి, ఇది గుండెపోటును అడ్డుకుంటుంది తెలుసా?

Haritha Chappa HT Telugu
Feb 25, 2024 10:00 AM IST

Brinjal: వంకాయలను వండుకునే వారి సంఖ్య ఎక్కువే. కానీ ఇష్టంగా మాత్రం తినరు. వంకాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలను ఇది తగ్గిస్తుంది.

వంకాయలతో గుండె ఆరోగ్యం
వంకాయలతో గుండె ఆరోగ్యం (pexels)

Brinjal: వంకాయ అంటే ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. గుత్తి వంకాయ కూరను కొంతమంది ఇష్టంగా తింటారు, మిగతా వంకాయ రెసిపీలను మాత్రం పక్కన పెట్టేస్తారు. నిజానికి వంకాయ కూరను వారంలో మూడు నుంచి నాలుగు సార్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్నిటికంటా ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అంతా వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు వంకాయ కూరను తినడం అలవాటు చేసుకోండి.

వంకాయ తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరగడం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు రావు. వంకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వంకాయలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. ఈ రెండు కారణాల వల్లే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీనిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు కూడా వంకాయ కూరను తరచూ తినవచ్చు.

వంకాయ కూరను వారానికి రెండు సార్లు అలవాటు చేయాలి. ఇది వారిలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే వారికి సులభంగా అరిగిపోతుంది. పిల్లలు వంకాయ కూర తినేందుకు ఇష్టపడరు. కానీ వారి చేత తినిపించే బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. వారిలో రక్తహీనత సమస్య రాకుండా, ఎముకలు పెళుసుగా మారకుండా వంకాయ కాపాడుతుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

పిల్లలు, పెద్దలు తమ మానసిక ఆరోగ్యం కోసం వంకాయలు తరచూ తింటూ ఉండాలి. కనీసం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వంకాయతో చేసిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు వంకాయను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. వంకాయతో వండిన ఆహారాలు ఎంత తిన్నా కూడా మీరు బరువు పెరగరు. కాబట్టి ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడే వారికి వంకాయ ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు.

వంకాయ తినడం వల్ల దురద వస్తుందని అంటారు. ఇది అపోహ మాత్రమే. గాయాలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడడంలో వంకాయలోని పోషకాలు ముందుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఇన్ఫెక్షన్ ను త్వరగా పోయేలా చేస్తాయి. పుండ్లను త్వరగా మాన్పే శక్తి వంకాయల్లో ఉంది.

ఎప్పుడూ ఒకేలా వంకాయ కూర వండుకుంటే బోర్ కొడుతుంది. వంకాయతో చేసుకునే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వంకాయ వేపుడు బాగుంటుంది. సాంబార్ తో వంకాయ వేపుడు కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే వాంగీ బాత్ అనే రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది. వాంగీబాత్ అంటే ఇంకేమీ కాదు వంకాయ రైస్‌నే వాంగీబాత్ అంటారు. ఇనిస్టెంట్ గా తయారు చేసుకునే వాంగీబాత్ పొడి మార్కెట్లలో లభిస్తుంది.

వంకాయను వేయించి ఈ వాంగీబాత్ పొడిని వేసుకుని అన్నాన్ని మిక్స్ చేసుకుంటే చాలు ఇది రెడీ అయిపోతుంది. అంతేకాదు ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక వంకాయ టమోటా కర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎంత అన్నమైనా కూడా వంకాయ టమోటా కర్రీ ఇంత వేసుకుంటే చాలు మొత్తం కలిసిపోతుంది. ఒకసారి ఇలా వారానికి రెండు మూడు సార్లు వంకాయలు తినడం అలవాటుగా మార్చుకోండి. మీ గుండెను కాపాడుకోండి.

Whats_app_banner