electric scooter launch: 100 కిమీ ల రేంజ్ తో, రూ. 82 వేలకే స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్
26 September 2024, 21:16 IST
Zelio Mystery electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ జెలియో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. జెలియో మిస్టరీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఇది సింగిల్ చార్జింగ్ తో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
జెలియో మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్
Zelio Mystery electric scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలియో భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. మిస్టరీగా పిలిచే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.82,000. స్టైలిష్ లుక్ తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం నగర వాహన దారులను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. జెలియో మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, గ్రే, బ్లాక్, సీ గ్రీన్ అనే నాలుగు కలర్ స్కీమ్ లలో లభిస్తుంది.
రేంజ్ 100 కిమీలు..
జెలియో మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ 72V/29AH లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తోంది, ఇది 72V మోటారుకు శక్తినిస్తుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మిస్టరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 120 కిలోలు మరియు పేలోడ్ సామర్థ్యం 180 కిలోలు.
జెలియో మిస్టరీ హార్డ్ వేర్
హార్డ్ వేర్ పరంగా, జెలియో మిస్టరీ ముందు, వెనుక భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంబి బ్రేకింగ్ సిస్టం కూడా ఉంది. డిజిటల్ డిస్ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి జి రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యుఎస్బీ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 256 మంది డీలర్లు
గంటకు 90 కిలోమీటర్ల పరిధి, 150 కిలోల లోడ్ కెపాసిటీ కలిగిన హైస్పీడ్ కార్గో స్కూటర్ ను విడుదల చేయడానికి జెలియో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. జెలియోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 256 మంది డీలర్లు ఉన్నారు. మార్చి 2025 నాటికి ఆ సంఖ్యను 400 కు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.