తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi Watch 4 : సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​!

Redmi Watch 4 : సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

26 November 2023, 18:18 IST

    • Redmi Watch 4 : రెడ్​మీ వాచ్​ 4 లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్​వాచ్​కి సంబంధించిన టీజర్​ని సంస్థ రివీల్​ చేసింది.
సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​!
సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​! (Representative image)

సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​!

Redmi Watch 4 : ఈ నెల 29న చైనాలో ఓ మెగా ఈవెంట్​ని ప్లాన్​ చేసింది షావోమీ సంస్థ. ఇందులో.. రెడ్​మీ కే70 సిరీస్​ని లాంచ్​ చేస్తోంది. ఈ సిరీస్​తో పాటు బుక్​ ల్యాప్​టాప్స్​, రిఫ్రిజరేటర్​, ఇయర్​బడ్స్​, స్మార్ట్​వాచ్​ని కూడా లాంచ్​ చేయనుంది. కాగా.. ఈ స్మార్ట్​వాచ్​.. రెడ్​మీ వాచ్​ 4 అని రూమర్స్​ వినిపించాయి. వీటి మధ్య.. ఈ వాచ్​కి సంబంధించిన టీజర్​ని సంస్థ రివీల్​ చేసింది. ఆ వివరాలు..

రెడ్​మీ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​..

రెడ్​మీ వాచ్​ 4లో అల్యుమీనియం అలాయ్​ ఫ్రేమ్​ వస్తోంది. రెడ్​మీ నుంచి ఓ వాచ్​కి మెటల్​ బాడీ ఉండటం ఇదే తొలిసారి! అలాయ్​ ఫ్రేమ్​కి స్టెయిన్​లెస్​ స్టీల్​ రొటేటింగ్​ క్రౌన్​ కూడా ఉంది. దీనికి డైమండ్​ కట్​ డిజైన్​ వస్తోంది.

ఇక ఈ స్మార్ట్​వాచ్​లో 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 1.97 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 600 నిట్స్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. స్క్రీన్​కు ఎల్​టీపీఎస్​ టెక్నాలజీ వస్తోంది. ఫలితంగా.. పవర్​ వినియోగం తక్కువగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్​ ఎక్కువగా ఉంటుంది.

ఇక కస్టమర్లు, వారి ఇష్టాలకు తగ్గట్టు ఈ రెడ్​మీ వాచ్​ 4ని కస్టమైజ్​ చేసుకోవచ్చని టీజర్​ ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. ఈ వాచ్​, 4 రకాల వ్రిస్ట్​ బ్యాండ్​లతో వస్తోంది. అవి.. మెటల్​, లెథర్​, ఫాబ్రిక్​, టీపీయూ.

స్మార్ట్​వాచ్​లో 5ఏటీఎం వాటర్​ రెసిస్టెన్స్​, బిల్ట్​-ఇన్​ జీపీఎస్​ సపోర్ట్​ వంటివి ఉంటాయి. వీటితో పాటు 24/7 హార్ట్​ రేట్​ మానిటరింగ్​ సిస్టెమ్​ సహా అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ ఈ వాచ్​లో ఉంటాయి. కాగా.. వీటిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. లాంచ్​ టైట్​లో వీటిపై ఓ క్లారిటీ వస్తుంది. అంతర్జాతీయ లాంచ్​ తర్వాత.. ఈ మోడల్​, ఇండియాలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఫైర్​ బోల్ట్​ కొత్త వాచ్​ చూశారా..?

ఫైర్​ బోల్ట్​ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్ ఇటీవలే​ లాంచ్​ అయ్యింది. దీని పేరు ఫైర్​ బోల్ట్​ రాయల్​. ఈ మోడల్​ డిజైన్​ చాలా స్టైలిష్​గా ఉంది. అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కూడా లభిస్తున్నాయి. ఇందులో మ్యూజిక్​ని స్టోర్​ చేసుకునేందుకు 4జీబీ స్టోరేజ్​ వస్తుండటం విశేషం. దీనికి మెటల్​ బాడీ ఉంటుంది. సర్క్యులర్​ డయల్​, రొటేటింగ్​ క్రౌన్​, 2 బటన్స్​ డిజైన్​ దీని సొంతం. ఇందులో 1.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం