Redmi K70 : సూపర్ ఫీచర్స్‌తో రెడ్మీ కే70 సిరీస్.. ఈ నెలలోనే లాంచ్!
Redmi K70 : రెడ్మీ కే70 సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల చివర్లో ఈ సిరీస్ లాంచ్ అవ్వొచ్చు.
Redmi K70 : రెడ్మీ కే70 సిరీస్‌పై గత కొంతకాలంగా స్ట్రాంగ్ బజ్ నెలకొంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి కే70, కే70 ప్రో, కే70 ఈ. వీటికి సంబంధించిన లీక్స్.. ఆన్లైన్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు.. చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా సైట్ వీబోలో మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి. వాటిని చూద్దాము..
రెడ్మీ కే70..
లీక్ అయిన డేటా ప్రకారం.. ఈ రెడ్మీ కే70, కే70 ప్రో, కే70ఈలో ఒకటే తరహా డిజైన్ ఉంటుంది. కే70లో.. ఫ్లాష్ లైట్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మెటాలిక్ ఫ్రేమ్ లభిస్తోంది. 50ఎంపీ ప్రైమరీ ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ లాంటివి ఉంటాయి. కింది భాగంలో స్పీకర్ గ్రిల్, యూఎస్బీ పోర్ట్, మైక్రోఫోన్, సిమ్ స్లాట్లు వస్తాయి.
Redmi K70 pro price : రూమర్స్ ప్రకారం.. రెడ్మీ కే70, కే70 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్స్ ఉంటాయి. మరోవైపు కే70ఈలో డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటుంది. రమొదటి రెండు డివైజ్‌లలో ఫ్లాట్ డిజైన్‌తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్ వస్తాయి. కే70లో 1.5కే రిసొల్యూషన్, కే70 ప్రోలో 2కే రిసొల్యూషన్ సపోర్ట్ లభిస్తుందట!
ఈ రెడ్మీ కే70 సిరీస్‌లో ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ సాఫ్ట్వేర్ ఉండే అవకాశం ఉంది. బేస్ మోడల్లో 5000 ఎంఏహెచ్, ప్రో మోడల్లో 5,120 ఎంఏహెచ్, కే70ఈ గ్యాడ్జెట్లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ నడుస్తోంది.
Redmi K70 launch date in India : కాగా.. ఈ రెడ్మీ కే70 సిరీస్‌ని ఈ నెల చివరి నాటికి లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇండియాలో లాంచ్‌తో పాటు ఇతర ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం