Fire Boltt Royale : ఫైర్ బోల్ట్ రాయల్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే!
Fire Boltt Royale smartwatch : ఫైర్ బోల్ట్ సంస్థ.. కొత్త స్మార్ట్‌వాచ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫైర్ బోల్ట్ రాయల్ వాచ్ ధర, ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Fire Boltt Royale smartwatch : ఫైర్ బోల్ట్ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయ్యింది. దీని పేరు ఫైర్ బోల్ట్ రాయల్. ఈ మోడల్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది. అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఫైర్ బోల్ట్ రాయల్ స్మార్ట్‌వాచ్..
ఈ ఫైర్ బోల్ట్ రాయల్ వాచ్‌లో మ్యూజిక్‌ని స్టోర్ చేసుకునేందుకు 4జీబీ స్టోరేజ్ వస్తుండటం విశేషం. దీనికి మెటల్ బాడీ ఉంటుంది. సర్క్యులర్ డయల్, రొటేటింగ్ క్రౌన్, 2 బటన్స్ డిజైన్ దీని సొంతం. ఇందులో 1.43 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్ కూడా ఉంది. ఈ గ్యాడ్జెట్ పీక్ బ్రైట్నెస్ 750 నిట్స్.
Fire Boltt Royale launch date in India : ఇక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ మోడల్లో హార్ట్ రేట్ సెన్సార్, ఎస్పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్ వంటివి ఉన్నాయి. 300కుపైగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. వీఆర్ వర్కౌట్ మోడ్ హైలైట్ అని తెలుస్తోంది. హైడ్రేషన్ రిమైండర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే.. మీరు మంచి నీరు తాగాలని, ఈ స్మార్ట్‌వాచ్ గుర్తుచేస్తుంది!
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఈ ఫైర్ బోల్ట్ కొత్త స్మార్ట్‌వాచ్‌లో బిల్ట్ ఇన్ స్పీకర్, హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్, స్టాప్‌వాచ్, కాల్క్యులేటర్, కెమెరా- మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, వెథర్ అప్డేట్స్తో పాటు అనేక ఫీచర్స్ ఈ మోడల్లో వస్తున్నాయి. ఇందులో 380 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఫైర్ బోల్ట్ రాయల్ ధర ఎంతంటే..
Fire Boltt Royale price : ఫైర్ బోల్ట్ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లో భాగం ఈ రాయల్. దీని ధర రూ. 4,999గా ఉంది. రోస్ రెడ్, గోల్డ్, బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్స్‌లో ఈ గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ నెల 25న ఈ మోడల్ సేల్స్ ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న వారు.. అమెజాన్‌తో పాటు ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్సైట్లో ఈ వాచ్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.
గేమ్ ఆఫ్ థ్రోన్స్' థీమ్‌తో స్మార్ట్‌వాచ్..
ఇంగ్లీష్ టీవీ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. ఈ జీఓటీ థీమ్‌తో ఓ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది పెబుల్ సంస్థ. ఇందులో 1.43 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. బ్లూటూత్ ఫీచర్ ద్వారా ఫోన్స్ ఆన్సర్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం