Fire-Boltt Phoenix Ultra smartwatch: ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సేల్ మొదలు.. స్టీల్ డిజైన్‍తో..-fire boltt phoenix ultra smartwatch sale begins on amazon fire boltt official website ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Fire Boltt Phoenix Ultra Smartwatch Sale Begins On Amazon Fire Boltt Official Website

Fire-Boltt Phoenix Ultra smartwatch: ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సేల్ మొదలు.. స్టీల్ డిజైన్‍తో..

Chatakonda Krishna Prakash HT Telugu
May 01, 2023 03:08 PM IST

Fire-Boltt Phoenix Ultra smartwatch: ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సేల్‍కు వచ్చింది. స్టీల్ స్ట్రాప్స్, స్టీల్ బాడీని ఈ వాచ్ కలిగి ఉంది

ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సేల్ మొదలు (Photo: Fire-Boltt)
ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సేల్ మొదలు (Photo: Fire-Boltt)

Fire-Boltt Phoenix Ultra smartwatch: విభిన్నమైన లుక్ ఉండే స్టీల్ స్ట్రాప్‍తో ఫైర్ బోల్డ్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఫైర్ బోల్ట్ తాజాగా ఈ వాచ్‍ను లాంచ్ చేసింది. సేల్ కూడా మొదలైంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే డిస్‍ప్లే, డ్యూరబుల్ స్టీల్ డిజైన్‍ను ఈ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 120పైగా స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి. Fire-Boltt Phoenix Ultra smartwatch ధర, సేల్, పూర్తి ఫీచర్ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Fire-Boltt Phoenix Ultra: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ వచ్చింది. ఇందుకోసం ఈ వాచ్‍లో బుల్ట్ఇన్‍గా స్పీకర్, మైక్ ఉంటాయి. మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. వాచ్‍లోనే కాల్ హిస్టరీ యాక్సెస్ చేసుకోవచ్చు. క్విక్ డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ సదుపాయాలు ఉంటాయి. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లో పొందవచ్చు.

Fire-Boltt Phoenix Ultra: డిస్‍ప్లే, డిజైన్

స్టెయిన్‍లెస్ స్టీల్ స్ట్రాప్స్, స్టీల్ బాడీని Fire-Boltt Phoenix Ultra స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. మొత్తంగా స్లీక్, స్టీల్ డిజైన్‍తో వచ్చింది. 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.39 ఇంచుల 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ రౌండ్ షేప్డ్ టచ్ డిస్‍ప్లేతో ఈ వాచ్ వచ్చింది. 100కుపైగా బుల్ట్ ఇన్ వాచ్ ఫేసెస్ ఉంటాయి.

120కుపైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్టుతో ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ వస్తోంది. నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉంటాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ వెల్లడించింది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం IP7 రేటింగ్‍ను Fire-Boltt Phoenix Ultra స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. కాల్యుకులేటర్, అలారమ్, ఫైండ్ మై ఫోన్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

Fire-Boltt Phoenix Ultra: ధర, సేల్

ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. దీన్ని స్పెషల్ లాంచ్ ధరగా ఫైర్ బోల్ట్ పేర్కొంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఫైర్ బోల్ట్ అఫీషియల్ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్ మొదలైంది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే, సిల్వర్, రెయిన్‍బో కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది. స్పెషల్ లాంచ్ ధర కొంత కాలమే ఉండే ఛాన్స్ ఉంది.

WhatsApp channel