తెలుగు న్యూస్  /  Business  /  Xiaomi Republic Day Sale Discounts Offers On Smart Tvs

Xiaomi Republic day Sale: షావోమీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు.. రూ.10వేలలోపు ధరకే దక్కించుకునేలా..

19 January 2023, 13:45 IST

    • Xiaomi Republic day Sale: షావోమీ రిపబ్లిక్ డే సేల్‍లో స్మార్ట్ టీవీలపై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ కార్డు, యూపీఐ, పేటీఎం వ్యాలెట్ ఆఫర్లు కూడా వినియోగించుకోవచ్చు.
Xiaomi Republic day Sale: షావోమీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు.. (Photo: Xiaomi)
Xiaomi Republic day Sale: షావోమీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు.. (Photo: Xiaomi)

Xiaomi Republic day Sale: షావోమీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు.. (Photo: Xiaomi)

Xiaomi Republic day Sale: రిపబ్లిక్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ సేల్స్ సీజన్ నడుస్తోంది. ప్రముఖ బ్రాండ్ షావోమీ (Xiaomi) కూడా రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తోంది. కంపెనీ వెబ్‍సైట్ ఎం.కామ్ (mi.com)లో ఈ సేల్ నడుస్తోంది. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్‍లో షావోమీ మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు అన్ని ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇండస్‍ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‍లో కొన్ని షావోమీ, రెడ్‍మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో (Smart TV offers) లభిస్తున్నాయి. డిస్కౌంట్‍తో పాటు కార్డు ఆఫర్లను వినియోగించుకుంటే తక్కువ ధరకే టీవీలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం షావోమీ రిపబ్లిక్ డే సేల్‍లో బెస్ట్ గా ఉన్న స్మార్ట్ టీవీ డీల్స్ ఇవే.

రెడ్‍మీ స్మార్ట్ టీవీ 32 హెచ్‍డీ రెడీ

రెడ్‍మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుత సేల్‍లో తగ్గింపు ధరకు లభిస్తుంది. ఈ రెడ్‍మీ స్మార్ట్ టీవీ 32 హెచ్‍డీ రెడీ (Redmi Smart TV 32 HD Ready) మోడల్ ధర సేల్‍లో రూ.10,999గా ఉంది. ఇండస్‍ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు దక్కుతుంది. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్‍లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. ఒకవేళ పేటీఎం వ్యాలెట్‍, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ.1,000 డిస్కౌంట్ దక్కుతుంది.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ (Xiaomi Smart TV 5A) ప్రస్తుత సేల్‍లో డిస్కౌంట్‍తో రూ.12,499 ధరతో ఉంది. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక యూపీఐ యాప్స్, పేటీఎం వ్యాలెట్‍తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000 తగ్గింపు దక్కుతుంది. ఇండస్‍ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్ కూడా ఉంటుంది. ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

రెడ్‍మీ స్మార్ట్ టీవీ ఎక్స్43

రెడ్‍మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 (Redmi Smart TV X43) షావోమీ రిపబ్లిక్ డే సేల్‍లో రూ.24,999 ధరకు అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్ రూ.1,000 ఆఫర్ కూడా వర్తిస్తుంది. పేటీఎం వ్యాలెట్ ఆఫర్, ఇండస్‍ఇండ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ డిస్కౌంట్ కూడా వాడుకోవచ్చు. మొత్తంగా ఈ 4కే హెచ్‍డీఆర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీపై అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.