తెలుగు న్యూస్  /  బిజినెస్  /  World's Richest Billionaires: ప్రపంచ కుబేరులు వీరే.. మన ముకేశ్ అంబానీ స్థానం ఏంటో తెలుసా?

World's richest billionaires: ప్రపంచ కుబేరులు వీరే.. మన ముకేశ్ అంబానీ స్థానం ఏంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu

05 October 2023, 11:58 IST

  • World's richest billionaires: ఫోర్బ్స్ (Forbes) మేగజీన్ 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో తొలి 10 మంది సంపన్నుల్లో భారతీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కూడా ఉన్నారు.

ప్రపంచ కుబేరులు
ప్రపంచ కుబేరులు

ప్రపంచ కుబేరులు

World's richest billionaires: ప్రముఖ బిజినెస్ మేగజీన్ ఫోర్బ్స్ (Forbes) ప్రతీ సంవత్సరం ప్రపంచ కుబేరుల జాబితాను ప్రకటిస్తుంటుంది. వారి సంపదను లెక్కగట్టి, ఆ వివరాలతో జాబితాను విడుదల చేస్తుంటుంది. తాజాగా, 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది.

ఫ్రెంచ్ బిజినెస్ మ్యాగ్నెట్

2023 సంవత్సరంలో అత్యంత సంపన్నుడిగా ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ (Bernard Jean Étienne Arnault) నిలిచారు. ఆయన సంపద 211 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో 200 బిలియన్ డాలర్లకు మించిన సంపద ఉన్నది ఈయన ఒక్కడికే. లగ్జరీ గూడ్స్ కు సంబంధించిన ప్రీమియం బ్రాండ్ లూయీస్ వీటన్ (Louis Vuitton) ఈయనదే. ట్విటర్ ను కొనుగోలు చేసి, దాని మేనేజ్మెంట్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని, ఆ తరువాత దాని పేరు ఎక్స్ గా మార్చిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ సంపద 180 బిలియన్ డాలర్లు.

టాప్ 10 లో ముకేశ్ అంబానీ

ఈ జాబితాలో టాప్ 10 లో భరతీయ ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూడా స్థానం సంపాదించారు. ఆయన ఈ జాబితాలో 9 వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ సంపద 83.4 బిలియన్ డాలర్లు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు ప్రపంచ సంపన్నులంతా తమ సంపదలో కొంత భాగాన్ని నష్టపోయారు. స్టాక్స్ విలువ పడిపోవడం, రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, స్టార్ట్ అప్ లపై పెట్టిన పెట్టుబడులను నష్టపోవడం.. తదితర కారణాలతో వారు తమ సంపదలో గణనీయ భాగాన్ని కోల్పోయారు.

టాప్ 10 లిస్ట్ లో ఉన్నది వీరే..

ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలోని టాప్ 10 లో ఆమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 114 బిలియన్ డాలర్లు. మిగతా స్థానాల్లో..

4) ల్యారీ ఎలిసన్ - 107 బిలియన్ డాలర్లు.

5) వారెన్ బఫెట్ - 106 బిలియన్ డాలర్లు.

6) బిల్ గేట్స్ - 104 బిలియన్ డాలర్లు.

7) మైఖేల బ్లూమ్ బర్గ్ - 94.5 బిలియన్ డాలర్లు.

8) కార్లోస్ స్లిమ్ - 93 బిలియన్ డాలర్లు.

9) ముకేశ్ అంబానీ - 83.4 బిలియన్ డాలర్లు.

10) స్టీవ్ బాల్మర్ - 80.7 బిలియన్ డాలర్లు.

తదుపరి వ్యాసం