తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India Gdp: ఈ సంవత్సరం ఇండియా జీడీపీ ఎంత ఉండబోతోంది?.. వరల్డ్ బ్యాంక్ ఏమంటోంది?

India GDP: ఈ సంవత్సరం ఇండియా జీడీపీ ఎంత ఉండబోతోంది?.. వరల్డ్ బ్యాంక్ ఏమంటోంది?

HT Telugu Desk HT Telugu

03 October 2023, 14:30 IST

  • India GDP: 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత దేశ జీడీపీ ఎంత ఉండబోతోందో వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఒడిదుడుకులు, సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ప్రశంసనీయ పనితీరు చూపుతోందని కితాబిచ్చింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India GDP: వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరును అంచనా వేస్తూ ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ఆ దేశాల జీడీపీ (GDP) ఎంత ఉండబోతోందో ప్రపంచ బ్యాంక్ (World Bank) ప్రతీ ఏటా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం భారత దేశ జీడీపీని అంచనా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

ఈ ఏడు జీడీపీ 6.3%

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత దేశ జీడీపీ (India GDP) 6.3 శాతంగా ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ముఖ్యంగా ఇండియా సర్వీస్ సెక్టార్ గొప్ప ఫలితాలను సాధిస్తుందని, సేవల రంగం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండబోతోందని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల వృద్ధి రేటు కూడా 8.9% ఉంటుందని తెలిపింది. ఈ వివరాలతో ఇండియా డెవలప్ మెంట్ అప్ డేట్ (India Development Update -IDU) ను మంగళవారం వరల్డ్ బ్యాంక్ వెలువరించింది.

ప్రతికూలతలపై ప్రశంసనీయ సమరం

అంతర్జాతీయ ప్రతికూలతలను, దేశయ సవాళ్లను భారత్ ప్రశంసనీయంగా ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతల మధ్య కూడా 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసించింది. ఆ సంవత్సర భారత దేశ వృద్ధి రేటు 7.2% గా ఉందని వెల్లడించింది. ఇది జీ 20 దేశాల్లో రెండో అత్యధిక వృద్ధి రేటు అని వెల్లడించింది.

బ్యాంకుల రుణ వితరణ

భారతీయ బ్యాంకులు కూడా తమ రుణ వితరణలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (April-June 2023) లో అత్యధికంగా 15. 8% వృద్ధిని నమోదు చేసిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకుల రుణవితరణ 13.3% గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ లో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉండబోతోందని తెలిపింది. భారత్ లో ఈ సంవత్సరం విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతాయని వెల్లడించింది.

తదుపరి వ్యాసం