తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Wipro Q2 Results: విప్రో నికర లాభంలో 9.6 శాతం తగ్గుదల

Wipro Q2 results: విప్రో నికర లాభంలో 9.6 శాతం తగ్గుదల

HT Telugu Desk HT Telugu

12 October 2022, 16:12 IST

  • Wipro Q2 results: విప్రో నికర లాభంలో 9 శాతం తగ్గుదల నమోదైంది.

విప్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (ఫైల్ ఫోటో)
విప్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (ఫైల్ ఫోటో) (PTI)

విప్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (ఫైల్ ఫోటో)

Wipro Q2 results: 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విప్రో నికర లాభం 9.6 శాతం తగ్గింది. అమెరికాయేతర మార్కెట్లలో క్లయింట్ల నుంచి ఆదాయం తగ్గడంతో నికర లాభం తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,649.1 కోట్లుగా చూపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 2,930 కోట్లుగా ఉంది.

కంపెనీ రెవెన్యూ రూ. 22,539.7 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో ఇది రూ. 19,667.4 కోట్లుగా ఉంది.

కంపెనీ ఆదాయం యూరప్ ప్రాంతంలో దెబ్బతిన్నంది. ఇక్కడ రూ. 918.6 కోట్ల నుంచి రూ. 787.5 కోట్లకు తగ్గింది.

అలాగే ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఏపీఎంఈఏ) రీజియన్‌లో కూడా ఆదాయం తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 302.8 కోట్ల మేర ఉండగా.. ఇప్పుడు రూ. 219.4 కోట్లుగా ఉంది.

తదుపరి వ్యాసం