తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Edit Message: వాట్సాప్‍ యూజర్లకు గుడ్‍న్యూస్: మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు

WhatsApp Edit Message: వాట్సాప్‍ యూజర్లకు గుడ్‍న్యూస్: మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు

22 May 2023, 20:02 IST

  • WhatsApp Edit Message Feature: వాట్సాప్‍ యూజర్లు ఇక సెండ్ చేసిన తర్వాత కూడా మెసేజ్ ఎడిట్ చేసుకోవచ్చు. సెండ్ చేసిన 15 నిమిషాలలోగా మెసేజ్‍లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. 

WhatsApp Edit Message: వాట్సాప్‍ యూజర్లకు గుడ్‍న్యూస్: మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు (Photo: WhatsApp)
WhatsApp Edit Message: వాట్సాప్‍ యూజర్లకు గుడ్‍న్యూస్: మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు (Photo: WhatsApp)

WhatsApp Edit Message: వాట్సాప్‍ యూజర్లకు గుడ్‍న్యూస్: మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు (Photo: WhatsApp)

WhatsApp Edit Message Feature: ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్ రోల్అవుట్‍ను వాట్సాప్ మొదలుపెట్టింది. రానున్న కొన్ని వారాల్లో అందరికీ ఈ ఎడిట్ ఫీచర్ యాడ్ అవుతుందని వాట్సాప్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా.. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా 15 నిమిషాల్లోగా దాన్ని ఎడిట్ చేయవచ్చు. ఏదైనా తప్పు ఉంటే మెసెజ్ డెలివరీ అయిన 15 నిమిషాల్లోగా సరిదిద్దవచ్చు. అంటే మెసేజ్‍ను సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చన్న మాట. ఇటీవల వాట్సాప్ బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం ఎడిట్ మెసేజ్ ఫీచర్ రాగా.. ఇప్పుడు సాధారణ యూజర్లకు రోల్అవుట్ మొదలుపెట్టింది వాట్సాప్. పూర్తి వివరాలు ఇవే.

ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది?

WhatsApp Edit Message: ప్రస్తుతం వాట్సాప్‍లో సెండ్ చేసిన మెసేజ్‍లో ఏదైనా తప్పు ఉంటే.. ఆ మెసేజ్‍ను డిలీట్ చేసి మళ్లీ పంపడమో.. లేకపోతే తప్పు ఉందని తెలియజేయడమే చేయాల్సి వస్తోంది. అయితే, ఎడిట్ మెసేజ్ ఫీచర్ రావటంతో మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా సరిదిద్దవచ్చు. మెసేజ్ డెలివరీ అయిన 15 నిమిషాలలోగా ఎడిట్ చేయవచ్చు. మెసేజ్ కింద ఎడిటెడ్ అని కనిపిస్తుంది.

ఎడిట్ మెసేజ్ ఫీచర్ ప్రస్తుతం టెక్స్ట్ మెసేజ్‍లకు అందుబాటులో ఉంది. ఫొటోలు, వీడియోలు, ఇతర మీడియా టైప్‍లు, క్యాప్షన్‍లను సెండ్ చేసిన తర్వాత ఎడిట్ చేయలేం. అయితే, టెక్స్ట్ మెసేజ్‍లను మాత్రం సెండ్ చేసిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు.

వాట్సాప్‍లో మెసేజ్ ఎలా ఎడిట్ చేయవచ్చంటే?

  • WhatsApp Edit Message: ముందుగా వాట్సాప్‍లో సెండ్ చేసిన మెసేజ్‍పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి (లాంగ్ ప్రెస్ చేయండి). ఆండ్రాయిడ్ డివైజ్‍ల్లో మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి. ఐఫోన్‍లలో మెసేజ్‍పై లాంగ్ ప్రెస్ చేసి, ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి. వెబ్/డెస్క్‌టాప్‍ల్లో మెసేజ్ మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు.
  • ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేసి.. మెసేజ్‍ను సరిదిద్ది అప్‍డేట్ చేసుకోవచ్చు.
  • ఎడిట్ పూర్తయ్యాక, చెక్ మార్క్‌పై ట్యాప్ చేస్తే మెసేజ్ అప్‍డేట్ అవుతుంది. మెసేజ్ ఎడిట్ పూర్తవుతుంది.

WhatsApp Edit Message: ఈనెల మొదట్లో కొందరు బీటా యూజర్లకు వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, సాధారణ యూజర్లందరికీ రోల్అవుట్‍ను నేడు వాట్సాప్ ప్రారంభించింది. దీంతో రానున్న కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్‍లలో వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ యాడ్ అవుతుంది.