TVS Apache RR 310 : అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌లో మరిన్ని క్రేజీ ఫీచర్స్!
09 September 2024, 9:44 IST
- TVS Apache RR 310 : అపాచీ ఆర్ఆర్ 310ని టీవీఎస్ అఫ్డేట్ చేయనుంది. ఈ మోడల్లో మరిన్ని ఫీచర్స్ యాడ్ అవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూడండి..
సరికొత్తగా టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310..
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ బైక్ అపాచీ ఆర్ఆర్ 310కు మేజర్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త వర్షెన్ టెస్టింగ్ స్పై షాట్లు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఫలితంగా ఈ బైక్ లాంచ్ త్వరలోనే ఉంటుందని ఊహగానాలు జోరందుకున్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 కంపెనీ. బీఎండబ్ల్యూ మోటరాడ్ మధ్య జాయింట్ వెంచర్ కింద మొదటి ప్రాజెక్టులలో ఒకటి. దాని పనితీరు-ఆధారిత ప్లాట్ఫామ్, అధునాతన ఫీచర్ జాబితా కోసం ఔత్సాహికుల్లో ఫేవరెట్గ అవతరించింది. గత సంవత్సరం, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మరింత శక్తివంతమైన ఇంజిన్. ఎలక్ట్రానిక్స్ సూట్‌ను పొందింది. కానీ అవే అప్డేట్స్ ఎప్పుడూ అపాచీ ఆర్ ఆర్ 310కి చేరలేదు.
అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ 310: కీలక మార్పులు..
టీవీఎస్ నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ బైక్ 2025 అపాచీ ఆర్ఆర్ 310 స్పై షాట్స్ కొన్ని ఆసక్తికరమైన చేర్పులు చూపించాయి. మోటార్ సైకిల్ సాధారణ బాడీ ప్రస్తుత దాని కంటే చాలా భిన్నంగా లేనప్పటికీ, మరింత స్టైలిష్‌గా మారింది.
ఫెయిర్‌పై అమర్చిన ఈ ఏరో ఎలిమెంట్స్, సాధారణంగా పెద్ద, మరింత శక్తివంతమైన మోటార్ సైకిళ్లలో కనిపిస్తాయి. మంచి స్థిరత్వం, తక్కువ డ్రాగ్‌ను అందిస్తాయి. భారత మార్కెట్లో 310సీసీ మోటార్ సైకిల్‌కి ఇది దక్కడం ఇదే తొలిసారి అవుతుంది.
ఇదీ చూడండి:- Offers on Honda Activa : పండుగ సీజన్లో ఈ రెండు హోండా వాహనాలపై భారీ ఆఫర్స్.. త్వరపడండి!
అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ 310: పనితీరు, ఫీచర్లు
అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బహుశా 35.08 బీహెచ్పీ పవర్, 28.7 ఎన్ఎమ్ టార్క్‌తో ఆర్టీఆర్ 310లో ఉన్న అదే ఇంజిన్ని దక్కించుకోవచ్చు! అయితే దీని స్టార్ వ్యాల్యూ దాని ఎలక్ట్రానిక్స్. స్లిప్పర్ క్లచ్, రైడ్-బై-వైర్ థ్రాటిల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, హీటెడ్ అండ్ కూల్డ్ సీట్లు ఈ బైక్‌లో ఉండనున్నాయి.
అపాచీ ఆర్ఆర్ 310 మరొక ప్రధాన నవీకరణ 6-యాక్సిస్ ఐఎంయూ! డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ మిటిగేషన్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, రియర్ లిఫ్ట్-ఆఫ్ ప్రివెన్షన్, స్లోప్-రెస్పాన్సిబుల్ కంట్రోల్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్ట్‌లతో ఈ బైక్ అప్గ్రేడ్స్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Hero Splendor Plus : కొత్త ఫీచర్లతో హీరో స్ప్లెండర్ బైక్.. డిస్క్ బ్రేక్ కూడా.. ధర ఎంతంటే?
అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: లాంచ్..
అప్డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 లాంచ్‌పై ఖచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, తాజా దృశ్యాలు ఈ మోటార్ సైకిల్ త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, రాబోయే నెలల్లో ఈ బైక్ గురించి అదనపు వివరాలను బయటకు వస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.