Top SUVs Sold in April: ఏప్రిల్‍లో అత్యధికంగా అమ్ముడైన టాప్ ఎస్‍యూవీ కార్లు ఇవే
10 May 2023, 13:21 IST
- Top SUVs Sold in April: ఈ ఏడాది ఏప్రిల్‍లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీలు ఇవే. టాటా నెక్సాన్ అగ్రస్థానంలో నిలిచింది.
Top SUVs Sold in April: ఏప్రిల్‍లో అత్యధికంగా అమ్ముడైన టాప్ ఎస్‍యూవీ కార్లు ఇవే (Photo: HU Auto)
Top SUVs Sold in April: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUVs) సెగ్మెంట్ కార్లకు భారత్‍లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎస్‍యూవీ సేల్స్ కూడా దేశీయ మార్కెట్‍లో అధికమవుతున్నాయి. దీంతో కార్ల తయారీ సంస్థలు ఎస్‍యూవీలపై ఎక్కువ దృష్టిసారిస్తున్నాయి. కస్టమర్లు కూడా ఇటీవల క్రమంగా ఎస్‍యూవీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ తరుణంలో గత నెల (ఏప్రిల్, 2023)లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీలు ఏవో ఇక్కడ చూడండి. టాటా నెక్సాన్ టాప్‍లో నిలిచింది. ఏప్రిల్‍లో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 ఎస్‍యూవీల లిస్ట్ ఇదే.
టాటా నెక్సాన్ (Tata Nexon)
దేశంలో గత నెల (ఏప్రిల్, 2023) అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో టాటా నెక్సాన్ టాప్‍లో నిలిచింది. ఏప్రిల్‍లో 15,002 నెక్సాన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి (14,769)తో పోలిస్తే నెక్సాన్ ఎస్‍యూవీ వృద్ధి సాధించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే నెక్సాన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి కనిపించింది.
హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta)
హ్యుండాయ్ ఫ్లాగ్‍షిప్ ఎస్‍యూవీ క్రెటా సేల్స్ కూడా ఏప్రిల్‍లో పెరిగాయి. గత నెల 14,186 యూనిట్ల క్రెటా ఎస్‍యూవీలను హ్యుండాయ్ సేల్ చేసింది. ఈ ఏడాది మార్చి(14,026 )తో పోలిస్తే వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్(12,651)తో పోలిస్తే 12 శాతం వృద్ధి కనబరిచింది.
మారుతీ బ్రెజా (Maruti Brezza)
గత నెల దేశంలో 11,836 మారుతీ బ్రెజా ఎస్‍యూవీ కార్లు అమ్ముడయ్యాయి. మార్చిలో 16,722 యూనిట్లు సేల్ అవగా.. ఏప్రిల్‍లో ఈ కారు అమ్మకాలు ఈ కారు డౌన్ అయ్యాయి.
టాటా పంచ్ (Tata Punch)
టాటా మోటార్స్ స్మాలెస్ట్ ఎస్‍యూవీగా పంచ్ ఉంది. గత నెల దేశంలో 10,934 టాటా పంచ్ ఎస్‍యూవీ యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి (10,894) కంటే కాస్త వృద్ధి కనబరిచింది. గతేడాది ఏప్రిల్‍లోనూ సుమారు ఇదే తరహాలో పంచ్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది ఏప్రిల్‍లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue)
గత నెల దేశంలో 10,342 హ్యుండాయ్ వెన్యూ ఎస్‍యూవీ యూనిట్లు సేల్ అయ్యాయి. మార్చి (10,024)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. మొత్తంగా ఏప్రిల్‍లో టాప్ సోల్డ్ ఎస్‍యూవీల లిస్టులో వెన్యూ టాప్-5లో చోటు దక్కించుకుంది.
Top SUVs Sold in April: దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో ఈ ఐదింటి తర్వాత కియా సోనెట్ (9,744), మహీంద్రా స్కార్పియో (9,617), మారుతీ ఫ్రాంక్స్ (8,784), మహీంద్రా గ్రాండ్ విటారా (7,742), కియా సెల్టోస్ (7,213) ఎస్‍యూవీలు ఉన్నాయి.