తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Become Rich : స్మార్ట్​గా ప్లాన్​ చేయండి.. ఇలా కోటీశ్వరులవ్వండి!

How to become rich : స్మార్ట్​గా ప్లాన్​ చేయండి.. ఇలా కోటీశ్వరులవ్వండి!

Sharath Chitturi HT Telugu

30 July 2023, 20:20 IST

    • How to become rich : కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటున్నారా? ఈ టిప్స్​ పాటిస్తే.. ఆ కలలు నెరవేరుతాయి..
స్మార్ట్​గా ప్లాన్​ చేయండి.. ఇలా కోటీశ్వరులవ్వండి!
స్మార్ట్​గా ప్లాన్​ చేయండి.. ఇలా కోటీశ్వరులవ్వండి!

స్మార్ట్​గా ప్లాన్​ చేయండి.. ఇలా కోటీశ్వరులవ్వండి!

How to become rich : ఖరీదైన కారు, ఖరీదైన ఇల్లు, ఖరీదైన బట్టలు.. చాలా మంది వీటికోసం కలలు కంటుంటారు. చివరికి.. అవన్నీ మనవల్ల అయ్యే పనులు కావని కలలను చంపుకుంటారు. కానీ సరైన ఫైనాన్షియల్​ ప్లానింగ్​తో మన కలలను మనం నెరవేర్చుకోవచ్చు. మరి మీరు కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్​ మీకోసమే..

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

గోల్స్​ పెట్టుకోవాలి..

ముందుగా ఫైనాన్షియల్​ గోల్స్​ పెట్టుకోవాలి. జీవితాన్ని గోల్​ ఓరియెంటెడ్​గా మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రంగంలోకి దిగే ముందే మీ షార్ట్​ టర్మ్​, లాంగ్​ టర్మ్​ గోల్స్​ను సెట్​ చేసుకోండి. కారు కొనడం, ట్రిప్​కు వెళ్లడం వంటివి షార్ట్​ టర్మ్​ గోల్​ కిందకు వస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల చదువు వంటి విషయాలు లాంగ్​ టర్మ్​ కిందకు వస్తాయి.

అప్పులు చేయకు బ్రదరు..

అప్పుల భారం ఉంటే ఫైనాన్షియల్​ గోల్స్​ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. తప్పదు అనుకున్న సందర్భాల్లోనే అప్పుల కోసం ప్రయత్నించాలి. అసలేం అవసరమే లేకుండా అప్పులు చేయడం మంచిది కాదు.

ఇదీ చూడండి:- Billionaires in India: కెనడా, యూకే ల్లో కన్నా మన దగ్గరే బిలియనీర్లు ఎక్కువ

ఇన్​వెస్ట్​మెంట్​ చేయకపోతే ఎలా సోదరా..?

డబ్బులు పొదుపు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ఇన్​వెస్ట్​ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇన్​వెస్ట్​మెంట్​లో డబ్బులు పోతాయి అని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. రీసెర్చ్​ చేస్తే, మీకు కాన్ఫిడెన్స్​ వస్తుంది. ఆ రిటర్నులు చూసి ఇక ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని వదిలిపెట్టారు.

డైవర్సిఫికేషన్​ అవసరం..

How to become Crorepati : ఎప్పుడూ ఒకే రకం ఫుడ్​ తినరు కదా! ఎప్పుడూ ఒకే రకం దస్తులు వేసుకోరు కదా! అలాగే ఎప్పుడూ ఓకే అసెట్​లో పెట్టుబడులు చేయకూడదు. డైవర్సిఫికేషన్​ ఉండాలి. అప్పుడే కష్టాల్లోనూ ధైర్యంగా ఉంటారు.

స్మార్ట్​గా ఇన్​వెస్ట్​ చేయండి..

అందరు ఇన్​వెస్ట్​ చేస్తారు. కానీ స్మార్ట్​గా ఆలోచించి ఇన్​వెస్ట్​ చేస్తేనే.. తొందరగా కోటీశ్వరులు అవుతారు. ట్యాక్స్​ సేవింగ్స్​ స్కీమ్స్​, ఫండ్స్​ వంటివి ఎంచుకోండి. యంగ్​ ఏజ్​లో ఉన్నప్పుడు రిస్క్​ ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత నిదానంగా రిస్క్​ను తగ్గించుకోండి.

How to start investment journey : పైన చెప్పినవి పాటిస్తే.. దీర్ఘకాలంలో మీకు మంచి సంపద క్రియేట్​ అవుతుంది. అలా అని కాకుండా.. బ్యాంక్​లో డబ్బులు ఎలా వాడుతున్నారో కూడా తెలియకపోతే.. ఇక భవిష్యత్తులో కష్టాలు తప్పవు.

(గమనిక:- ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు ఫైనాన్షియల్​ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.)

తదుపరి వ్యాసం