తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : రూ .1 లక్షను రూ. 2కోట్లు చేసిన స్మాల్​ క్యాప్​ స్టాక్​- ఇన్​వెస్టర్స్​కి పండగే!

Multibagger stock : రూ .1 లక్షను రూ. 2కోట్లు చేసిన స్మాల్​ క్యాప్​ స్టాక్​- ఇన్​వెస్టర్స్​కి పండగే!

Sharath Chitturi HT Telugu

23 September 2024, 13:35 IST

google News
  • Multibagger stock alert : ఏసీఈ స్టాక్​ దుమ్మురేపింది! స్మాల్​ క్యాప్​ స్టాక్​గా ఉండి ఇన్​వెస్టర్స్​కి మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చింది. 11ఏళ్ల వ్యవధిలో రూ. 1లక్షను ఏకంగా సుమారు రూ. 2 కోట్లుగా చేసింది. పూర్తి వివరాలు..

రూ. 1లక్షను రూ. 2కోట్లుగా చేసిన మల్టీబ్యాగర్​ స్టాక్​!
రూ. 1లక్షను రూ. 2కోట్లుగా చేసిన మల్టీబ్యాగర్​ స్టాక్​! (Pixabay)

రూ. 1లక్షను రూ. 2కోట్లుగా చేసిన మల్టీబ్యాగర్​ స్టాక్​!

స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​కి కొదవే లేదు! అలాంటి స్టాక్​ ఒక్కటి తగిలినా చాలు అనుకుని చాలా మంది మల్టీబ్యాగర్​ రిటర్నుల కోసం చూస్తుంటారు. ఈ తరహా స్టాక్స్​ల యాక్షన్ కన్​స్ట్రక్షన్స్ ఎక్విప్​మెంట్​ (ఏసీఈ) ఒకటి! ఈ స్టాక్​ రూ. 1లక్షను 11ఏళ్లల్లో సుమారు రూ. 2కోట్లుగా మార్చింది. అంతేకాదు.. ఈ కంపెనీ ఫండమెంటల్​గా బలంగా ఉండటం ఇక్కడ ముఖ్యమైన విషయం. ప్రతి సంవత్సరం స్థిరమైన బిజినెస్​ని కొనసాగించడం ద్వారా దాని దీర్ఘకాలిక వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించింది.

మొబైల్ క్రేన్లు, టవర్ క్రేన్ల విభాగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ పరికరాల తయారీలో ఈ సంస్థ భారతదేశపు ప్రముఖ తయారీదారుగా ఉంది. మొబైల్ క్రేన్లతో పాటు, టవర్ క్రేన్లు, ఎలక్ట్రిక్ క్రేన్లు, క్రాలర్ క్రేన్లు, ట్రక్-మౌంటెడ్ క్రేన్లు, లోడర్లు, వైబ్రేటరీ రోలర్లు, ఫోర్క్​లిఫ్ట్స్, వేర్హౌసింగ్ పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాలతో సహా కంపెనీ విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది.

రూ. 1లక్ష = రూ. 2కోట్లు!

గత ఐదేళ్లలో ఈ మల్టీబ్యాగర్​ ఏసీఈ స్టాక్​ ధర రూ.74 నుంచి ప్రస్తుత విలువ రూ.1,398కి పెరిగింది. అంటే దాదాపు 1,800 శాతం అసాధారణ రాబడిని అందించినట్టు! గత 11 ఏళ్లలో ఈ షేరు రూ.7.65 నుంచి ప్రస్తుత విలువకు ఎగబాకింది. అంటే 18,714 శాతం లాభపడింది.

ఈ కాలంలో ఒక ఇన్​వెస్టర్ రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ రూ.1.82 కోట్లుగా ఉండేది! మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ 11 సంవత్సరాలలో, స్టాక్ రెండు క్యాలెండర్ ఇయర్స్​లో మాత్రమే నష్టాలను నమోదు చేసింది. మిగిలినవి సానుకూల రాబడులను ఇచ్చింది. ఫలితంగా ఇన్​వెస్టర్స్​లో ఈ ఏసీఈ కంపెనీపై నమ్మకం మరింత పెరిగింది.

219 శాతం పెరుగుదలతో సీవై17, 173 శాతం పెరుగుదలతో సీవై23 ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలోనే ఈ షేరు ఇప్పటికే 70 శాతం పెరిగి, ఏప్రిల్​లో తొలిసారి రూ.1,500 మార్కును దాటింది. రూ.1,695 వద్ద సరికొత్త ఆల్​టైమ్​ గరిష్టాన్ని తాకింది.

క్యూ1 ఏసీఈలో రికార్డు స్థాయి పనితీరు!

ఆదాయం, మార్జిన్ల పరంగా తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. నిర్వహణ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.82 శాతం (వైఓవై) పెరగడంతో బలమైన వృద్ధి వేగాన్ని ప్రదర్శించింది. అదనంగా, ఎబిటా మార్జిన్లు 212 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) పెరిగి 17.11 శాతానికి చేరుకున్నాయి.

ఏసీఈ క్రేన్​లు, నిర్మాణ పరికరాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్ వాల్యూమ్ లు కూడా 20 శాతం YOY గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఇది బలమైన త్రైమాసిక పనితీరుకు మరింత దోహదం చేసింది. ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.68 కోట్ల నుంచి రూ.84 కోట్లకు పెరిగింది.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం