తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Valentine's Day Gift Ideas : సెలబ్రేట్​ 'లవ్​'- ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇవ్వండి..

Valentine's day gift ideas : సెలబ్రేట్​ 'లవ్​'- ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇవ్వండి..

Sharath Chitturi HT Telugu

04 February 2024, 12:50 IST

  • Best smartphones to gift : వాలెంటైన్స్​ డే రోజున.. మీకు నచ్చిన వారికి మంచి స్మార్ట్​ఫోన్​ని గిఫ్ట్​గా ఇవ్వాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే..

సెలబ్రేట్​ 'లవ్​'- ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇవ్వండి..
సెలబ్రేట్​ 'లవ్​'- ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇవ్వండి.. (Pexels)

సెలబ్రేట్​ 'లవ్​'- ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ని గిఫ్ట్​గా ఇవ్వండి..

Valentine's day smartphones gift ideas : ప్రేమికుల రోజు వచ్చేస్తోంది! వాలెంటైన్స్​ డే రోజున.. తాము ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్​ ఇవ్వాలని.. చాలా ఇప్పటి నుంచే ప్లాన్స్​ వేస్తూ ఉంటారు. వారిలో మీరూ ఒకరా? ఒక మంచి స్మార్ట్​ఫోన్​ గిఫ్ట్​గా ఇస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో దొరుకుతున్న టాప్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​లో నుంచి ఒకటి పిక్​ చేసుకుని.. గిఫ్ట్​గా ఇచ్చేయండి.. లిస్ట్​లో ఉన్న గ్యాడ్జెట్స్​ ఇవే..

ఐఫోన్​ 15:-

స్మార్ట్​ఫోన్​ గిఫ్ట్స్​లో ఐఫోన్​ లేకపోతే ఎలా? మీ ప్రేమకు ఐఫోన్​ 15 గిఫ్ట్​గా ఇచ్చేయండి. ఇందులో 6.1 ఇంచ్​ సూపర్​ రెటినా ఎక్స్​డీఆర్​ ఓఎల్​ఈడీ స్క్రీన్​ ఉంటుంది. డైనమిక్​ ఐలాండ్​ ఫీచర్​ స్పెషల్​గా నిలుస్తుంది. 2000 యూనిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇందులో.. ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ ఉంటుంది. ఐఓఎస్​ 17 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 3,349 బ్యాటరీ సపోర్ట్​ ఈ ఐఫోన్​ 15కి లభిస్తుంది. 20వాట్​ ఛార్జర్.. 50శాతం ఛార్జింగ్​ని 30 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్​ లెన్స్​తో కూడిన రెర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 12ఎంపీ కెమెరా వస్తోంది.

రెడ్​మీ 12 నోట్​ 5జీ:-

Redmi 12 Note 5G price in India : ఈ వాలెంటైన్స్​ డేకి మేము సూచిస్తున్న గిఫ్ట్​ ఐడియాల్లో రెండోది.. రెడ్​మీ నోట్​ 12 5జీ. ఇందులో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 1 చిప్​సెట్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 12 ఆధారిత ఎంఐయూఐ 13 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 40ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా ఇందులో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం34 5జీ:-

వాలెంటైన్స్​ డే గిఫ్ట్​గా.. సామ్​సంగ్​ గెలాక్సీ ఎం34 ఇవ్వాలని చూస్తున్నారా? అయితే.. ఫీచర్స్​ ఇక్కడ తెలుసుకోండి. ఈ స్మార్ట్​ఫోన్​లో 6.5 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఎక్సినోస్​ 1280 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ దీని సొంతం. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీ, 12ఎంపీ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. ఆండ్రాయిడ్​ 13పై ఇది పని చేస్తుంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24:-

మా వాలంటైన్స్​ డే గిఫ్ట్స్​ లిస్ట్​లో రెండో సామ్​సంగ్​ గ్యాడ్జెట్​ ఇది. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24.. ఒక ప్రీమియం స్మార్ట్​ఫోన్​. ఇందులో 6.2 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డైనమిక్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. ఎక్సినోస్​ 2400 చిప్​సెట్​ దీని సొంతం. 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్​, 10ఎంపీ టెలిఫొటో లెన్స్​ ఇందులో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 4000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ స్మార్ట్​ఫోన్​ పని చేస్తుంది.

తదుపరి వ్యాసం