iPhone 15 sale : ఇండియాలో ఐఫోన్ 15 సేల్ షురూ.. క్యూ కట్టిన యాపిల్ లవర్స్!
iPhone 15 sale : ఇండియాలో ఐఫోన్ 15 సేల్ మొదలైంది. అఫీషియల్ స్టోర్స్ బయట యాపిల్ లవర్స్ క్యూ కట్టేశారు!

iPhone 15 sale : యాపిల్ లవర్స్‌కు క్రేజీ న్యూస్! సంస్థ ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించిన సేల్.. ఇండియాలో శుక్రవారం మొదలైంది. సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అఫీషియల్ స్టోర్స్‌లో కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముంబై, దిల్లీలోని యాపిల్ స్టోర్స్‌కు ప్రజలు ఉదయం నుంచే క్యూ కట్టారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఐఫోన్ 15 సిరీస్..
తొలి దశలో భాగంగా.. ఇండియాతో పాటు మొత్తం మీద 40 దేశాల్లో ఐఫోన్ 15 సిరీస్ సేల్కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వంటి మోడల్స్ ఉన్నాయి. మొదటి రెండు గ్యాడ్జెట్స్.. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉన్నాయి. పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
iPhone 15 sale in India : ఇండియాలో.. ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900గా ఉంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,34,900. అదే సమయంలో టాప్ ఏండ్ వేరియంట్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,900.
లాంచ్ సమయం నుంచే ఐఫోన్ 15 సిరీస్‌కు బీభత్సమైన డిమాండ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్స్‌పై కస్టమర్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడం గమనార్హం. అందుకే.. ఈ టాప్ ఎండ్ మోడల్స్.. కస్టమర్ల చేతికి నవంబర్ చివర్లో వస్తుందని టాక్ నడుస్తోంది.
క్యూ కట్టిన యాపిల్ ఫ్యాన్స్..!
ముంబై బీకేసీలో యాపిల్ స్టోర్‌ను సంస్థ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఐఫోన్ 15 సిరీస్ సేల్ నేపథ్యంలో ఇక్కడ కస్టమర్ల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. చాలా మంది.. గురువారం అర్ధరాత్రి నుంచే స్టోర్ బయట ఎదురుచూడటం మొదలుపెట్టారు!
BKC Apple store Mumbai : "ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కోసం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే వచ్చాను. అప్పటికే ఇక్కడ క్యూ ఉంది. ఏదైతే ఏంటీ.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనేశాను. చాలా మంచి అనుభూతి. నాకు టాప్ ఎండ్ మోడల్స్ అంటే ఇష్టం. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కూడా వచ్చింది. ఈసారి.. అందరికన్నా ముందే నేను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది," అని బీకేసీ స్టోర్ వద్ద గంటల తరబడి క్యూలో వెయిట్ చేసిన రాహుల్ అనే కస్టమర్ మీడియాకు తెలిపారు.
మరో వ్యక్తి అయితే ఏకంగా.. 17 గంటల పాటు క్యూలో నిలబడ్డాడు!
"నేను అహ్మదాబాద్ నుంచి ఇక్కడి నిన్న సాయంత్రం 3 గంటలకే వచ్చాను. అప్పటి నుంచి క్యూలోనే ఉన్నాను. 17 గంటల తర్వాత.. ఐఫోన్ కొన్నాను. ఇండియాలోనే తొలి యాపిల్ స్టోర్ నుంచి తొలి ఐఫోన్‌ను కొనేందుకే వెయిట్ చేశాను," అని యాపిల్ లవర్ వివేక్ చెప్పారు.
సంబంధిత కథనం