తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Laptops For Video Editing : వీడియో ఎడిటింగ్​ కోసం టాప్​-5 బెస్ట్​ ల్యాప్​టాప్స్​ ఇవే..

Best laptops for video editing : వీడియో ఎడిటింగ్​ కోసం టాప్​-5 బెస్ట్​ ల్యాప్​టాప్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu

20 February 2024, 7:20 IST

    • Laptops for video editing : వీడియో ఎడిటింగ్​ కోసం మంచి ల్యాప్​టాప్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టాప్​-5 బెస్ట్​ వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..
వీడియో ఎడిటింగ్​ కోసం టాప్​-5 బెస్ట్​ ల్యాప్​టాప్స్​ ఇవే..
వీడియో ఎడిటింగ్​ కోసం టాప్​-5 బెస్ట్​ ల్యాప్​టాప్స్​ ఇవే..

వీడియో ఎడిటింగ్​ కోసం టాప్​-5 బెస్ట్​ ల్యాప్​టాప్స్​ ఇవే..

Best video editing laptops : యూట్యూబ్​తో పాటు ఇతర సోషల్​ మీడియాలో వీడియో ఎడిటింగ్​కి ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని క్యాష్​ చేసుకునేందుకు వీడియో ఎడిటర్లు తమ స్కిల్స్​ని ప్రదర్శిస్తున్నారు. మరి మీరు కూడా ఒక వీడియో ఎడిటర్​ ఆ? ఈ రేస్​లో వెనకపడకుండా ఉండాలంటే.. మీ దగ్గర ఒక మంచి వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్​ ఉండాల్సిందే! మీకు ఉపయోగపడే.. టాప్​-5 బెస్ట్​ వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్స్​ లిస్ట్​ని మేము సిద్ధం చేశాము. ఓసారి చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

బెస్ట్​ వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్స్​..

యాపిల్​ మాక్​బుక్​ ప్రో:- ఇందులో 13 ఇంచ్​ రెటీనా డిస్​ప్లే ఉంటుంది. 8 కోర్​ సీపీయూతో ఎం1 చిప్​ వస్తోంది. 256జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​ దీని సొంతం. 20 గంటల బ్యాటరీ లైఫ్​ ఉండటం విశేషం. ఇవన్నీ.. ఈ మాక్​బుక్​ ప్రో పాజిటివ్​ పాయింట్స్​. కానీ ధర ఎక్కువగా ఉండటం, కనెక్టివిటీ పోర్ట్స్​ తక్కువగా ఉండటం నెగిటివ్​ పాయింట్స్​.

హెచ్​పీ పెవీలియన్​:- పర్ఫార్మెన్స్​ని పోర్టెబులిటీని సరిగ్గా బ్యాలెన్స్​ చేస్తుంది ఈ హెచ్​పీ పెవీలియన్​ ల్యాప్​టాప్​. వీడియో ఎడిటింగ్​కి ఇది బెస్ట్​ ల్యాప్​టాప్​ అవుతుంది! ఇందులో 14 ఇంచ్​ మైక్రే ఎడ్జ్​ డిస్​ప్లే, 11వ జనరేషన్​ ఇంటెల్​ కోర్​ ఐ5 ప్రాసెసర్​, 512జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​, ఇంటెల్​ ఐరిస్​ ఎక్స్​ఈ గ్రాఫిక్స్​ వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రాసెసర్​, గ్రాఫిక్స్​ పవర్​ఫుల్​గా ఉండటం, స్టోరేజ్​ ఆప్షన్​ ఎక్కువగా ఉండటం పాజిటివ్​ పాయింట్స్​. కానీ బ్యాటరీ లైఫ్​ యావరేజ్​గా ఉండటం, డిస్​ప్లే ఇంకాస్త బ్రైట్​గా ఉండొచ్చు అనేవి నెగిటివ్​ పాయింట్స్​. ఈ హెచ్​పీ పెవీలియన్​ ధర రూ. 75వేలు.

Best laptops for video editing : ఏసస్​ వివోబుక్​:- ఇదొక హై పర్ఫార్మెన్స్​ ల్యాప్​టాప్​. వీడియో ఎడిటింగ్​కి కంటెంట్​ క్రియేషన్​కి ఇది సెట్​ అవుతుంది! ఇందులో 15.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే, 11వ జెనరేషన్​ ఇంటెల్​ కోర్​ ఐ5 11300హెచ్​ ప్రాసెసర్​, 512 జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​, ఎన్​విడియా జీఫోర్స్​ ఎంఎక్స్​350 గ్రాఫిక్స్​ వంటివి ఈ ల్యాప్​టాప్​ ఫీచర్స్​. డిజైన్​ ఇంప్రెసివ్​గా ఉండటం, ప్రాసెసర్​- గ్రాఫిక్స్​ పవర్​ఫుల్​గా ఉండటం పాజిటివ్​ పాయింట్స్​. బ్యాటరీ లైఫ్​ యావరేజ్​గా ఉండటం, బరువు ఎక్కువగా ఉండటం నెగిటివ్​ పాయింట్స్​. ఈ వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్​ ధర రూ. 75,990.

సామ్​సంగ్​ గెలాక్సీ బుక్​ ప్రో:- ఇందులో 13.3 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 11వ జనరేషన్​ ఇంటెల్​ కోర్​ ఐ7 ప్రాసెసర్​ దీని సొంతం. 512జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​, ఇంటెల్​ ఐరిస్​ ఎక్స్​ఈ గ్రాఫిక్స్​, 20 గంటల పాటు నడిచే బ్యాటరీ లైఫ్​ వంటివి ఈ మోడల్​ ఫీచర్స్​. స్క్రీన్​, పవర్​ఫుల్​ ప్రాసెసర్​- గ్రాఫిక్స్​, లాంగ్​ బ్యాటరీ లైఫ్​.. దీని పాజిటివ్​ పాయింట్స్​. కనెక్టివిటీ పోర్ట్స్​ తక్కువగా ఉండటం, ధర ఎక్కువగా ఉండటం నెగిటివ్​ పాయింట్స్​. ధర రూ. 1లక్ష.

Video editing laptops under 1 lakh : హెచ్​పీ పెవీలియన్​ గేమింగ్​:- ఈ గేమింగ్​ ల్యాప్​టాప్​లో హై పర్ఫార్మెన్స్​ గ్రాఫిక్స్​ ఉంటాయి. ఇందులో 15.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే, ఏఎండీ రైజెన్​ 5 4600హెచ్​ ప్రాసెసర్​, 1టీబీ హెచ్​డీడీ స్టోరేజ్​, ఎన్​వీడియా జీఫోర్స్​ జీటీఎక్స్​ 1650 గ్రాఫిక్స్​, బ్యాక్​లిట్​ కీబోర్డ్​ వంటివి ఫీచర్స్​. బ్యాటరీ లైఫ్​ యావరేజ్​గా ఉండటం, బరువు కాస్త ఎక్కువగా ఉండటం నెగిటివ్​ పాయింట్స్​. ఈ మోడల్​ ధర రూ. 1.1లక్షలు!

పర్ఫార్మెన్స్​, పోర్టెబులిటీ, ఎఫార్డెబులిటీ, వాల్యూ ఫర్​ మనీని పరిగణలోకి తీసుకుంటే.. వీడియో ఎడిటింగ్​ కోసం హెచ్​పీ పెవీలియన్​ ది బెస్ట్​ ల్యాప్​టాప్​ అవుతుంది. కనీ ఓవరాల్​ ప్రాడక్ట్​ పరంగా చూసుకుంటే.. మాక్​బుక్​ ప్రో 14.. వీడియో ఎడిటింగ్​ కోసం బెస్ట్​ ల్యాప్​టాప్​గా నిలుస్తుంది.

వీడియో ఎడిటింగ్​ ల్యాప్​టాప్​ని ఎలా సెలెక్ట్​ చేసుకోవాలి?

How to select best video editing laptop : వీడియో ఎడిటింగ్​ కోసం ల్యాప్​టాప్​ని తీసుకోవాలని చూస్తుంటే.. ప్రాసెసర్​, గ్రాఫిక్స్​, స్టోరేజ్​, బ్యాటరీ లైఫ్​పై దృష్టిపెట్టాలి. పర్ఫార్మెన్స్​ బ్యాలెన్స్​డ్​గా ఉండాలి. డిస్​ప్లే క్వాలిటీ, పోర్టెబులిటీ అనుకూలంగా ఉండాలి. అయితే.. హై పర్ఫార్మెన్స్​ గ్రాఫిక్స్​, ప్రాసెసర్స్​ ఉన్న గేమింగ్​ ల్యాప్​టాప్స్​ కూడా వీడియో ఎడిటింగ్​కి చక్కగా ఉపయోగపడతాయి.

తదుపరి వ్యాసం