తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Price : ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!

iPhone 16 price : ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!

Sharath Chitturi HT Telugu

18 February 2024, 16:56 IST

  • iPhone 16 price prediction : ఐఫోన్​ 16 సిరీస్​పై తాజాగా ఓ నివేదిక బయటకు వచ్చింది. అందులో.. ఐఫోన్​ 16 ప్రైజ్​తో మరిన్ని ఎగ్జైటింగ్​ వివరాలు ఉన్నాయి.

ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!
ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే! (AP)

ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​.. ధరలు ఇవే!

iPhone 16 release date : రూమర్స్​, లీక్స్​తో.. యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ రిపోర్ట్స్​.. యాపిల్​ లవర్స్​ని ఎంగేజ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. ఓ కొత్త నివేదిక​ బయటకి వచ్చింది. ఐఫోన్​ 16 సిరీస్​లో 5 మోడల్స్​ ఉంటాయని సమాచారం. వాటి ధరలకు సంబంధించిన వివరాలు కూడా అందులో ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐఫోన్​ 16 ధర వివరాలు..

టెక్​ ఇన్​సైడర్​ మజిన్​బు ప్రకారం.. ఐఫోన్​ 16 సిరీస్​లో ఎస్​ఈ వేరియంట్​ కూడా ఉంటుంది. ఐఫోన్​ 16 ఎస్​ఈ 128జీబీ ర్యామ్​ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఇక ఐఫోన్​ 16 ప్లస్​ ఎస్​ఈ 256 జీబీ వేరియంట్​ ధర 799 డాలర్లు (సుమారు రూ. 66,300). ఇక స్టాండర్డ్​/ బేసిక్​ ఐఫోన్​ 16 256జీబీ వేరియంట్​ ధర 699 డాలర్లు (సుమారు రూ. 58వేలు). ఐఫోన్​ 16 ప్రో 256జీబీ వేరియంట్​ ధర 999 డాలర్లు (సుమారు రూ. 82,900). ప్రో మ్యాక్స్​ 256జీబీ వేరియంట్​ ధర 1099 డాలర్లు (సుమారు రూ. 91,200).

iPhone 16 launch : ఐఫోన్​ 16 ధరపై అఫీషియల్​ అప్డేట్​ లేదు కానీ.. ప్రస్తుతం ఉన్న రూమర్స్​తో లేటెస్ట్​ ఐఫోన్​ గ్యాడ్జెట్స్​పై ఒక గ్లింప్స్​ అందినట్టు అయ్యింది.

ఇక ఈ రూమర్స్​లో హైలైట్​ విషయం.. యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​లో కొత్త మోడల్స్​ ఉంటాయని చెప్పడం. అవి.. ఐఫోన్​ 16 ఎస్​ఈ, 16 ఎస్​ఈ ప్లస్​. వీటికి వరుసగా 6.1 ఇంచ్​, 6.7 ఇంచ్​ డిస్​ప్లేలు ఉంటాయట. ఈ రెండింటిలోనూ డైమనిక్​ ఐలాండ్​ నాచ్​ వస్తుంది.

iPhone 16 pro : ఇక ఐఫోన్​ 16, 16 ప్రో మోడల్స్​లో 6.3 ఇంచ్​ డిస్​ప్లే ఉండే అవకాశం ఉంది. ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​లో మాత్రం భారీ 6.9 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుందని టాక్​ నడుస్తోంది.

ఇక కెమెరా కాన్ఫిగరేషన్స్​ విషయానికొస్తే.. ఐఫోన్​ 16 ఎస్​ఈ మోడల్స్​లో సింగిల్​ పిల్​ షేప్​లో రేర్​ కెమెరా ఉండొచ్చు. ఐఫోన్​ ఎక్స్​లో కూడా ఇదే ఉంటుంది. కానీ స్డాండర్డ్​ ఐఫోన్​ 16లో డ్యూయెల్​ కెమెరా సెటప్​ ఉండొచ్చు. ప్రో మోడల్స్​లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్​ 15 ప్రో, ప్రో మ్యాక్స్​లో ఇవే ఉంటాయి.

iPhone 16 price in India : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఐఫోన్​ 16 సిరీస్​ లాంచ్​ అవుతుంది. అప్పటివరకు రూమర్స్​ కొనసాగుతూనే ఉంటాయి. అవి.. ఐఫోన్​ లవర్స్​ని ఎంగేజ్​ చేస్తూనే ఉంటాయి.

తదుపరి వ్యాసం