తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Tiago Ev : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్​.. మరింత అట్రాక్టివ్​గా..!

Tata Tiago EV : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్​.. మరింత అట్రాక్టివ్​గా..!

Sharath Chitturi HT Telugu

19 March 2024, 14:16 IST

    • Tata Tiago EV new features : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్​ని యాడ్​ చేసింది సంస్థ. కానీ ధరను మాత్రం పెంచలేదు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా టియాగో ఈవీలోకి కొత్త ఫీచర్స్​..
టాటా టియాగో ఈవీలోకి కొత్త ఫీచర్స్​..

టాటా టియాగో ఈవీలోకి కొత్త ఫీచర్స్​..

Tata Tiago EV on road price Hyderabad : ఇండియాలో అతి చౌకైన ఎలక్ట్రిక్​ వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలో సైలెంట్​గా కొన్ని కొత్త ఫీచర్స్​ని యాడ్​ చేసింది టాటా మోటార్స్​. ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​ఆర్​ వేరియంట్​కు ఇప్పుడు ఆటో- డిమ్మింగ్​ ఐఆర్​వీఎం ఆప్షన్​ వస్తోంది. అంటే.. ఐఆర్​వీఎం స్విచ్​ని మాటిమాటికి డ్రైవర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇక ఎక్స్​జెడ్​+ వేరియంట్​లో 45 వాట్​ యూఎస్​బ పోర్ట్​ వస్తోంది. మొబైల్​ డివైజ్​ల ఛార్జింగ్​ మరింత ఫాస్ట్​ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

ఈ ఫీచర్స్​ కూడా..!

పైన చెప్పిన వాటితో పాటు టాటా టియాగో ఈవీలో.. పోలెన్​ ఎయిర్​ ఫిల్టర్​, ఆటో ఫోల్డ్​ ఔట్​సైడ్​ రేర్​వ్యూ మిర్రర్స్​ వంటివి సైతం.. ఎక్స్​జెడ్​+ వేరియంట్లలో వస్తున్నాయి. ఇక టాటా టియాగో ఈవీ అన్ని వేరియంట్లలోనూ బ్లాక్​ రూఫ్​ని తొలగించేసింది టాటా మోటార్స్​. వీటిని మినహయిస్తే.. పెద్దగా మార్పులు ఏవీ కనిపించడం లేదు.

కొత్త ఫీచర్స్​ని యాడ్​ చేసినా, టియాగో ఈవీ ధరను మాత్రం టాటా మోటార్స్​ పెంచలేదు. ఈ ఎలక్ట్రిక్​ కారు ఎక్స్​షోరూం ధర రూ. 7.99లక్షలు- రూ. 11.89లక్షల మధ్యలో ఉంది.

Tata Tiago EV latest news : ఇక టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్​ వేరియంట్లలో 250కి.మీల రేంజ్​ ఉంటుంది. లాంగ్​ రేంజ్​ వేరియంట్లను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ రెండు వర్షన్స్​లోనూ.. 3ఏళ్లు లేదా 1,25,000 కి.మీల వెహికిల్​ వారెంటీ వస్తోంది. బ్యాటరీ ప్యాక్​పై 8ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు వారెంట్​ని ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

ఈ టాటా టియాగో ఈవీలో 4 లెవల్స్​ బ్రేక్​ రీజనరేషన్​, 2 డ్రైవింగ్​ మోడ్స్​ వస్తున్నాయి. మీడియం రేంజ్​ వర్షెన్​లోని మోటార్​ 60 బీహెచ్​పీ పవర్​ని, 110 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక లాంగ్​ రేంజ్​లోని మోటార్​.. 73 బీహెచ్​పీ పవర్​ని, 114 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

టాటా మోటార్స్​.. సేఫ్టీకి పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఇక టాటా టియాగో ఈవీలోనూ అనేక సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి. అవి.. డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్​, యాంటీలాక్​ బ్రేకింగ్​ సిస్టెమ్​, రేర్​ పార్కింగ్​ సెన్సార్​, ఇంపాక్ట్​ సమయంలో ఆటో బ్యాటరీ కట్​ ఆఫ్​, పంచర్​ రిపైర్​ కిట్​.

Tata Tiago EV new features : సిట్రోయెన్​ సీ3, ఎంజీ కామెట్​ ఈవీలకు ఈ టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తోంది. వాటి ఎక్స్​షోరూం ధరలు రూ. 11.61 లక్షల దగ్గర ప్రారంభమవుతాయి. ఈ విషయంలో టాటా టియాగో ఈవీకి కాస్త ఎడ్జ్​ ఉందనే చెప్పుకోవాలి!

తదుపరి వ్యాసం