Tata Tiago EV: టాటా టియాగో ఈవీ సూపర్ హిట్.. 4 నెలల్లో 10 వేల సేల్స్
05 May 2023, 21:02 IST
Tata Tiago EV: టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ కు అద్భుత స్పందన లభిస్తోంది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే 10 వేల టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
Tata Tiago EV: లాంచ్ చేసిన 4 నెలల్లోనే 10 వేల టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయని టాటా మోటార్స్ ప్రకటించింది. అంతేకాదు, భారత్ లో అత్యంత వేగంగా 10 వేల బుకింగ్స్ పూర్తి చేసుకున్న (Fastest Booked EV in India) కారు కూడా టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు అని వెల్లడించింది.
Tata Tiago EV: రూ. 8 లక్షలు..
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. భారీ బ్యాటరీ తో వచ్చే మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని, వారి ఆసక్తి, అవసరాల ఆధారంగా ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తున్నామని టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స్ తెలిపారు. ఆది నుంచి టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు రికార్డులు సృష్టిస్తోందన్నారు.
Tata Tiago EV: టూ బ్యాటరీ ఆప్షన్
టాటా టియగో ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో లభిస్తుంది. చిన్న బ్యాటరీ సామర్ధ్యం 19.2 కిలో వాట్ కాగా, పెద్ద బ్యాటరీ సామర్ధ్యం 24 కిలోవాట్. 19.2 కిలో వాట్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్న కారు డ్రైవింగ్ రేంజ్ 250 కిమీలు కాగా, 24 కిలోవాట్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్న కారు డ్రైవింగ్ రేంజ్ 315 కిమీలు. టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు XE, XT, XZ+, XZ+ Lux వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Citroen E:C3, MG Comet EV ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఈ టాటా టియాగో ఈవీ ఉంది.