తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Ev's Price Cut : ‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!

Tata EV's price cut : ‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!

Sharath Chitturi HT Telugu

13 February 2024, 11:53 IST

    • Tata Nexon EV price cut : టాటా ఈవీలను కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి గుడ్​ న్యూస్​! రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ధరలను భారీగా తగ్గించింది టాటా మోటార్స్​. ఆ వివరాలు..
‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!
‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!

‘ఈవీ’ ధరలను భారీగా తగ్గించిన టాటా మోటార్స్​.. రూ. 1.2 లక్షల వరకు!

Tata Tiago EV price cut : కస్టమర్లకు అదిరిపోయే వార్తను ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. తమ ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా ఉన్న రెండు ఈవీల ధరలను భారీగా తగ్గించింది టాటా మోటార్స్​. ఆ రెండు వాహనాలు.. టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టియాగో ఈవీ. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​పై ధర ఎంత తగ్గింది? ఇప్పుడెంత ధరకు వస్తున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఈవీలపై భారీ ప్రైజ్​ కట్​..!

ఇండియా ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. ఈ సెగ్మెంట్​లో అత్యధిక మార్కెట్​ షేరు కలిగి ఉన్న సంస్థ ఇదే. మరీ ముఖ్యంగా.. ఎంట్రీ లెవల్​ టాటా టియాగో ఈవీకి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై రూ. 70వేలు తగ్గించింది టాటా మోటార్స్​. ఈ ప్రైజ్​ కట్​తో.. ఇప్పుడు ఇక టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.99లక్షలకు చేరింది.

ఇక మరో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​.. టాటా నెక్సాన్​ ఈవీపై ఏకంగా రూ. 1.2లక్షల వరకు ధరలను తగ్గించింది టాటా మోటార్స్​. ఫలితంగా.. ఇప్పుడు.. టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 14.49లక్షలకు పడిపోయింది. లాంగ్​ రంజ్​ వర్షెన్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.99లక్షలుగా ఉంది.

Tata Nexon EV price cut : ఎలక్ట్రిక్​ వాహనాల్లో బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే.. ఇటీవలి కాలంలో.. బ్యాటరీ ప్యాక్​ల ధరలు దిగొస్తున్నాయి. బ్యాటరీ సెల్స్​ కొనుగోలు చేస్తున్న వారికి కాస్త ఉపశమనం దక్కింది. అందుకే.. ఈవీల ధరలను తగ్గించాలని టాటా మోటార్స్​ సంస్థ భావించింది.

అయితే.. ఇటీవలే లాంచ్​ అయిన టాటా పంచ్​ ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ని టాటా మోటార్స్​ కట్​ చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. బ్యాటరీ ప్యాక్​ ధర తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకునే, లాంచ్​ సమయంలో ఆ ధరను ప్రకటించామని సంస్థ చెప్పుకొచ్చింది. అంటే.. ఇప్పట్లో టాటా పంచ్​ ఈవీ ధరలు తగ్గవు. అంతేకాకుండా.. ఇంట్రొడక్టరీ ప్రైజ్​ ముగిసిన అనంతరం.. ధరలు పెరిగే అవకాశం ఉంది.

Tata motors price cut news : టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టియాగో ఈవీ ధరల తగ్గింపుపై స్పందించారు టాటా మోటార్స్​ సీసీఓ (చీఫ్​ కమర్షియల్​ ఆఫీసర్​) వివేక్​ శ్రీవత్స.

"ఈవీల ఉత్పత్తిలో బ్యాటరీలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. గత కొంతకాలంగా.. బ్యాటరీ ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా తగ్గుతాయని తెలుస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకుని, కస్టమర్లకు ఉపశమనాన్ని ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాము. దేశంలో ఈవీల కొనుగోళ్లు గత కొన్నేళ్లుగా పెరిగాయి. కానీ.. ఈవీనే మొదటి ఛాయిస్​గా ఎంచుకోవాలన్నదే మా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే మా పోర్ట్​ఫోలియోను సిద్ధం చేస్తున్నాము. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్​ వాహనాలు మా పోర్ట్​ఫోలియోలో ఉన్నాయి. ఇక ధరలు తగ్గించడంతో.. టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టియాగో ఈవీలు కస్టమర్లకు మంచి ఛాయిస్​ అవుతాయని ఆశిస్తున్నాము," అని వివేక్​ అభిప్రాయపడ్డారు.

Tata EVs price drop : వాస్తవానికి ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పుడు.. టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టియాగో ఈవీలపై ఈ స్థాయిలో ధరలు దిగొస్తుండటం.. కస్టమర్లకు నిజంగా మంచి విషయమే!

తదుపరి వ్యాసం