తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Harrier Facelift: టాాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ లో లేటెస్ట్ ఫీచర్స్ ఇవే

Tata Harrier facelift: టాాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ లో లేటెస్ట్ ఫీచర్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

17 October 2023, 16:46 IST

google News
  • Tata Harrier facelift: టాటా మోటార్స్ ఇటీవల తమ ప్రీమియ ఎస్ యూ వీ టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తిగా కొత్త డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో దీన్ని తీర్చి దిద్దింది.

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్
టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్

Tata Harrier facelift: టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. తమ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎస్ యూవీ నెక్సన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను టాటామోటార్స్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ ధరలో..

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ప్యూర్ ప్లస్ (Pure +), అడ్వెంచర్ ప్లస్ (Adventure+), ఫీయర్ లెస్ (Fearless), ఫీయర్ లెస్ ప్లస్ (Fearless+) మోడల్స్ లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వర్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది. ఏటీ వేరియంట్ల ధరలే కాకుండా, అన్ని వేరియంట్ల ధరలో మరికొన్ని వారాల్లో పెరిగే అవకాశముందని టాటా మోటార్స్ సంకేతాలిస్తోంది.

బుకింగ్స్ ప్రారంభం..

ఈ టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఎస్ యూ వీ బుకింగ్స్ భారత్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఎక్స్ టీరియర్ డిజైన్ నే కాకుండా, ఇంటీరియర్స్ లో సమూల మార్పులు చేశారు. టెక్నాలజీ ల కూడా అప్ డేట్స్ చేశారు. టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ తో పాటు టాటా సఫారీ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను కూడా లాంచ్ చేశారు. టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ను అమర్చాను. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాయ్ వీల్స్ డిజైన్ ను కూడా మార్చారు. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ ఈ డీ టెయిల్ లైట్స్ ను ఏర్పాటు చేశారు. బంపర్ డిజైన్ లోనూ మార్పులు చేశారు.

ఇంటీరియర్ లో..

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఇంటీరియర్స్ ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. ఇందులోడ్యాష్‌బోర్డ్‌ ను కొత్తగా తీర్చి దిద్దారు. మధ్యలో బ్రాండ్ లోగో, టచ్ బటన్‌లతో స్టీరింగ్ వీల్ డిజైన్ ను కూడా మార్చారు. 10.2-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, 12.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 10-స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుకవైపు సన్ బ్లైండ్‌, ఎయిర్ ప్యూరిఫైయర్‌ని కూడా ఏర్పాటు చేశారు.

5 స్టార్ రేటింగ్..

టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్ట్ వర్షన్ గ్లోబల్ NCAP ఫైవ్-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన వాటితో సహా అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అలాగే, 11 ఫంక్షన్‌లతో కూడిన ADAS కారు భద్రతను పెంచుతుంది. ఇందులో BS6 ఫేజ్-2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ను అమర్చారు. ఈ ఇంజన్ 168 బీహెచ్ పీ గరిష్ట శక్తిని మరియు 350 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం