Big Basket walk in store in Hyd: హైదరాబాద్ లో బిగ్ బాస్కెట్ వాక్ ఇన్ స్టోర్
28 December 2022, 21:48 IST
Big Basket walkin store in Hyd: టాటా ఎంటర్‌ప్రైజెస్ ఈ కామర్స్ వింగ్ ‘బిగ్‌బాస్కెట్’ హైదరాబాద్‌లో మొట్టమొదటి, వినూత్నమైన వాక్ ఇన్ స్టోర్‌ను ప్రారంభించింది.
బిగ్ బాస్కెట్ వాక్ ఇన్ స్టోర్ లో రైతుకు సన్మానం
ఈ స్టోర్‌లో పండ్లు, కూరగాయలు కాకుండా 4000కు పైగా ఉత్పత్తి విభాగాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
Big Basket walkin store in Hyd: మణికొండలో..
బిగ్‌బాస్కెట్(big basket) తమ మొట్టమొదటి వాక్–ఇన్ – స్టోర్‌ను హైదరాబాద్‌లోని మణికొండ వద్ద ప్రారంభించింది. ఈ సెల్ఫ్ సర్వీస్ స్టోర్‌లో వినియోగదారులు ఎంచుకునేందుకు 4వేలకు పైగా ఉత్పత్తి విభాగాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో వ్యక్తిగత సంరక్షణ, బ్రాండెడ్ ఫుడ్స్, బేవరేజస్, కిచెన్‌వేర్, బేబీకేర్‌తో పాటుగా పండ్లు, కూరగాయలు, గ్రోసరీ ఉంటాయి. దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో బిగ్‌బాస్కెట్ కో –ఫౌండర్ వీఎస్ సుధాకర్ మరియు పూర్వ సభ్యులు బొల్లిపల్లి నగేష్ , గువ్వ కుమార్ పాల్గొన్నారు. ఈ స్టోర్‌లోని కూరగాయలను నేరుగా రైతుల నుంచి సేకరించడం విశేషం.
Big Basket walkin store in Hyd: వినియోగదారుల ప్రయోజనాలు..
వినియోగదారులు, సరఫరాదారుల ప్రయోజనాలు లక్ష్యంగా బిగ్ బాస్కెట్ పని చేస్తుందని బిగ్ బాస్కెట్ కో –ఫౌండర్, వీఎస్ సుధాకర్ తెలిపారు. అందులో భాగంగా, వారికి మరింత చేరువ కావడం కోసం ఇప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్ ను ప్రారంభించామన్నారు. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందించే. ఈ తరహా స్టోర్‌లను భారతదేశ వ్యాప్తంగా మరిన్ని ఓపెన్ చేయనున్నామన్నారు. ఉత్పత్తి శ్రేణి పరంగా సూపర్‌మార్కెట్‌లకు దీటుగా ఉండే బిగ్‌బాస్కెట్ స్టోర్ , స్థానిక మార్కెట్‌లతో పోలిస్తే అతి తక్కువ ధరలకు వస్తువులను అందిస్తుంది. ఈ డిజిటల్ ఆధారిత ఔట్‌లెట్‌లో వినియోగదారుల సౌకర్యార్ధం సెల్ఫ్, అసిస్టెడ్ బిల్లింగ్ కౌంటర్లు ఉంటాయి. వినియోగదారులు తామెంచుకున్న ఉత్పత్తులను బిల్లింగ్ కౌంటర్ వద్ద స్కాన్ చేసుకుని ఆన్‌లైన్ చెల్లింపులు సైతం చేయవచ్చు.
Big Basket walkin store in Hyd: నో ప్లాస్టిక్ ప్యాకేజింగ్
పర్యావరణ అనుకూల కార్యక్రమంలో భాగంగా, ఇప్పుడు నో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విధానాన్ని బిగ్ బాస్కెట్ అనుసరిస్తోంది. బిగ్‌బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నెలకు 15 మిలియన్‌లకు పైగా వినియోగదారుల ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆదాయం 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది.