Tata Altroz new variants: టాటా ఆల్ట్రోజ్ లో రెండు కొత్త వేరియంట్లు; ధర ఎంతో తెలుసా?
21 July 2023, 18:25 IST
సక్సెస్ ఫుల్ మోడల్ ఆల్ట్రోజ్ లో మరో రెండు కొత్త వేరియంట్లను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎక్స్ఎం, ఎక్స్ఎం (ఎస్) వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
టాటా ఆల్ట్రోజ్ కారు
సక్సెస్ ఫుల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్ట్రోజ్ లో మరో రెండు కొత్త వేరియంట్లను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎక్స్ఎం (XM), ఎక్స్ఎం (ఎస్) (XM S) వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ధరల ప్రకారం.. టాటా ఆల్ట్రోజ్ లో ఎక్స్ఈ (XE), ఎక్స్ఎం ప్లస్ (XM+) వేరియంట్లు మధ్య కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్ఎం (XM), ఎక్స్ఎం (ఎస్) (XM S) వేరియంట్లు ఉంటాయి.
ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్ ధరలు, ఫీచర్లు..
కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్లలో ఎక్స్ఎం (ఎస్) (XM S) వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 7.35 లక్షలుగా ఉంది. ఎక్స్ఎం (XM) వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 6.90 లక్షలుగా ఉంది. ఎక్స్ఎం (XM) వేరియంట్ లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్స్ సీట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, 16 ఇంచ్ వీల్స్.. తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఎక్స్ఎం (ఎస్) (XM S) వేరియంట్ లో పైన పేర్కొన్న ఫీచర్స్ తో పాటు అదనంగా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలోనూ, మిగతా వేరియంట్లలో మాదిరిగానే పవర్ విండోస్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
ఇంజన్ వివరాలు..
కొత్త వేరియంట్స్ రెండింటిలోనూ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో 1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోలు ఇంజన్ ను అమర్చారు. ఇది 88 పీఎస్ గరిష్ట పవర్, 115 ఎన్ఎం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో మారుతి సుజుకీ బేలెనో, టయోటా గ్లాంజా, హ్యుండై ఐ 20, హ్యుండై ఐ 10.. లతో పోటీ పడుతోంది.